/rtv/media/media_files/2025/05/21/Lq38tOB89qxeNYboPPE4.jpg)
Tamil Nadu DMK leader sexual harassment issue NCW action
Tamil Nadu: డీఎంకే నేత లైంగిక వేధింపుల ఇష్యూలో జాతీయ మహిళా కమిషన్ జోక్యం చేసుకుంది. భార్య ఫిర్యాదుతో సుమోటోగా కేసు నమోదు చేసింది. మూడు రోజుల్లోగా యాక్షన్ రిపోర్ట్, ఎఫ్ఐఆర్ కాపీని సమర్పించాలని తమిళనాడు పోలీసులను కోరింది.
పిచ్చి కుక్కలా కొరుకుతాడు..
ఈ మేరకు తన భర్త, డీఎంకే నేత తనపై హింస, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు భార్య ఆరోపించింది. తనను పిచ్చికుక్కల కొరకడంతో పాటు, 20 ఏళ్ల అమ్మాయిలను రాజకీయ నాయకుల వద్ద పడుకోబెట్టడం కోసం ఎంతకైనా దిగజారుతాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఈ వివాదం మహిళా కమీషన్‌కు చేరగా.. తమిళనాడు డీజీపీ దీనిపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపి, బాధితుల రక్షణ కోసం ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. అలాగే నిందితుడిపై త్వరితగతిన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని NCW డిమాండ్ చేసింది.
డీజీపీకి సంచలన లేఖ
'అధికార డీఎంకే యువజన విభాగం అధికారిపై లైంగిక వేధింపులు, వేధింపుల ఆరోపణలపై జాతీయ మహిళా కమిషన్ (NCW) సుమోటోగా కేసు నమోదు చేసుకుంది. బాలికలను రాజకీయ నాయకులతో పడుకోమని బలవంతం చేస్తున్నట్లు ఫిర్యాదు అందింది. ఈ ఆరోపణలను సమాజాన్ని కలవరపరిచేవిగా ఉన్నాయి' అంటూ NCW చైర్‌పర్సన్ విజయ రహత్కర్ తమిళనాడు డీజీపీకి లేఖ రాశారు.
ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఆ ఏరియాల్లో దంచికొడుతున్న వాన!
రాజకీయ జోక్యం లేకుండా బాధితురాలి భద్రతను దృష్టిలో ఉంచుకుని స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కమిషన్ కోరింది. భారతీయ న్యాయ సంహిత, 2023లోని సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేసి, మూడు రోజుల్లోగా యాక్షన్ రిపోర్ట్, ఎఫ్ఐఆర్ కాపీని సమర్పించాలని NCW తమిళనాడు పోలీసులను కోరింది.
ఇది కూడా చదవండి: ఓట్స్ ఎవరు తినకూడదు? ఎందుకు తినకూడదు.. పూర్తి డీటెయిల్స్ ఇవే!
tamil-nadu | dmk | telugu-news | today telugu news