BIG BREAKING: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఆ ఏరియాల్లో దంచికొడుతున్న వాన!

హైదరాబాద్‌లో మళ్లీ వర్షం మొదలైంది. పలుచోట్ల భారీగా వర్షం కురుస్తోంది. అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. వర్షం వలన పలుచోట్ల రహదారులపై భారీగా నీరు నిలిచింది. వరద నీటితో వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

New Update

Hyderabad Rain: హైదరాబాద్‌లో మళ్లీ వర్షం మొదలైంది. పలుచోట్ల భారీగా వర్షం కురుస్తోంది.  సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, సరూర్‌నగర్‌, కొత్తపేట, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌, మారేడుపల్లి, అల్వాల్‌, సైదాబాద్‌, తిరుమలగిరి, బేగంపేట, సంతోష్‌నగర్‌, చాదర్‌ఘాట్‌, యూసఫ్‌గూడా, అమీర్‌పేట్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌,  ఎస్సార్‌నగర్‌, ఎర్రగడ్డ, తార్నాక, హబ్సిగూడ, అంబర్‌పేట, మాదాపూర్, కూకట్‌పల్లి, నాంపల్లి, కోఠి, లక్డీకపూల్ సహా పలు ప్రాంతాల్లో   వర్షం కురుస్తోంది. అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. వర్షం వలన పలుచోట్ల రహదారులపై భారీగా నీరు నిలిచింది.  వరద నీటితో వాహనదారులు  రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 అప్రమత్తంగా ఉండాలని..

 

బుధవారం ఉదయం నుంచే నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా, కొంతమేర మోస్తరు వర్షాలు, మరికొంతమేర భారీ వర్షాలు నమోదయ్యాయి. వర్షాల కారణంగా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని,  అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలుపుతున్నారు. ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3,5 డిగ్రీల వరకు తగ్గాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తక్కువ ఉష్ణోగ్రతలతో పాటు వాతావరణ పరిస్థితులు వర్షాలకు అనుకూలంగా మారడంతో వచ్చే 3 రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు ఈ ప్రభావంతో మరింతగా విస్తరించే అవకాశముందని తెలిపింది. 

ఇది కూడా చదవండి: ప్రతిరోజూ 1 గ్లాసు ఎండుద్రాక్ష పాలు తాగితే మీకు ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

 

ప్రస్తుతం దక్షిణ అరేబియా, దక్షిణ బంగాళాఖాతంలోనూ, అండమాన్ సముద్రంలో మిగిలిన భాగాల్లోనూ, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ ఈ రుతుపవనాలు ప్రవేశించే సూచనలు ఉన్నాయి. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఈదురుగాలుల వేగం గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశముంది. పలు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని, మిగతా జిల్లాల్లో సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.  

ఇది కూడా చదవండి: అబ్బాయిల కంటే అమ్మాయిలే ఈ విషయంలో బెస్ట్.. స్త్రీలు ఎంత వేగంగా బరువు తగ్గగలరంటే?

 

(TG weather1 | TG Weather Updates | latest-news | telugu-news | rain)

Advertisment
Advertisment
తాజా కథనాలు