/rtv/media/media_files/2025/10/30/kurnool-2025-10-30-15-20-33.jpg)
కర్నూలు బస్సు అగ్నిప్రమాద ఘటన(Kurnool Bus Accident) తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 19 మంది ఆ బస్సులోనే మంటల్లో చిక్కుకుని సజీవదహనం అయ్యారు. ఈ సంఘటన ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే బస్సు ప్రమాదం ఘటనాస్థలిలో బంగారం దొరుకుందని కొంతమంది వెతుకుతున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బస్సులోనే 19 మంది పూర్తిగా కాలిపోవడంతో వారి ఒంటిపై విలువైన ఆభరణాలు కాలిపోయి ఉంటాయని కొందరు వెతుకులాట మొదలు పెట్టారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు ధరించిన బంగారం, వెండి ఆభరణాలు మంటల్లో కరిగి బూడిదలో కలిసిపోయాయని భావించిన కొందరు స్థానికులు ప్రమాద స్థలికి చేరుకున్నారు. ఆభరణాల కోసం... వారు బస్సు ప్రమాద శిథిలాల వద్ద ఉన్న బూడిదను సంచుల్లో సేకరించారు. ఆ తర్వాత ఆ బూడిద సంచులను ప్రమాద స్థలికి దగ్గరలో ఉన్న ఒక కుంట వద్దకు తీసుకెళ్లి, నీటిలో కడిగి మరీ కరిగిపోయిన బంగారాన్ని, ఇతర ఆభరణాలను వెతికినట్లుగా తెలుస్తోంది..
Also Read : మోకాలి లోతు బురదలో తిరుగుతూ.. రైతులకు పవన్ భరోసా
సర్వత్రా విమర్శలు
ఈ హృదయ విదారక ఘటనపై దేశవ్యాప్తంగా సానుభూతి వ్యక్తమవుతున్న సమయంలో, మృతుల ఆభరణాల కోసం కొందరు ఇలా వెతకడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చనిపోయారన్న బాధ కనీసం లేకుండా ఇలాంటి పనిచేయడం నిజంగా సిగ్గుచేటు అని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇది శవాల మీద పేలాలు ఏరుకోవటం అంటే ఇదే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇది మానవత్వం మంటగలిసిన ఘటనగా అభిప్రాయపడుతున్నారు. ఇంతకన్నా దారుణం మరోకటి ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు. భగవంతుడా.. దేనికయ్య మనిషికి అంత ఆశను పుట్టిస్తున్నావ్ బంగారం డబ్బు ఆస్తులు అంతస్తులు మీద. మనిషి మనిషినీ అని కూడా మరచిపోతిన్నాడు మానవత్వం మరచి ఎక్కడ చూసిన అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
భగవంతుడా 🙏🙏
— Do Something For 👉Better Society ✊ (@ChitraR09535143) October 30, 2025
ఏమనుకోవాలి వీళ్ళను 😡
దేనికయ్య మనిషికి అంత ఆశను పుట్టిస్తున్నావ్ బంగారం డబ్బు ఆస్తులు అంతస్తులు మీద. మనిషి మనిషినీ అని కూడా మరచిపోతిన్నాడు మానవత్వం మరచి ఎక్కడ చూసిన...#HumanityFirstpic.twitter.com/yozEzPYSjp
Also Read : 3 క్వార్టర్ల మద్యం తాగాం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..బస్సుప్రమాదంపై ఎర్రిస్వామి కీలక విషయాలు
Follow Us