/rtv/media/media_files/2025/07/27/software-2025-07-27-19-10-05.jpg)
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వెంకట గోపాల్ బలవన్మరణం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల 24న ప్రాణాలు తీసుకున్నారు వెంకట గోపాల్. అతని చివరి లెటర్‌లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. భూమిపై అవినీతి, కాలుష్యం పెరిగిపోయింది.. నేను భారం అవ్వాలి అనుకోవడం లేదంటూ వెంకట గోపాల్ లేఖలో వెల్లడించాడు. నేను ప్రతి దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నానని, అది నా వల్ల కావడం లేదంటూ వెల్లడించారు. నేను భూమి మీద ఉండి ఉద్ధరించేది ఏం లేదు. అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నానని నాలుగు పేజీల లేఖలో తెలిపాడు.
Also read : Telangana crime : కొడుకు చేతిలో చిప్స్ పెట్టి లవర్తో జంప్.. దొరికిన ప్రేమ జంట!
ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా
ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రికి చెందిన గుత్తుల వెంకట గోపాల్ (26) రాయదుర్గంలోని ఓ ఐటీ కంపెనీలో గత రెండేళ్లుగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. తన అన్నావదినలతో కలిసి మణికొండలోని షిరిడి సాయినగర్‌లో నివాసం ఉంటున్నాడు. జులై 23వ తేదీన అన్న, వదినలతో కలిసి రాజమండ్రికి వెళ్లాడు. అదే రోజు రాత్రి వెంకట గోపాల్ తిరిగి మణికొండకు వచ్చాడు. 24న తల్లిదండ్రులతో ఫోన్ మాట్లాడగా, 25న ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉంది.
Also read : Hyderabad: గూగుల్ మ్యాప్‌లో చావుని వెతుక్కుంటూ.. మూసీలో కొట్టుకుపోయిన బీటెక్ స్టూడెంట్
దీంతో కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం వాచ్‌మెన్‌కు ఫోన్ చేశారు. వాచ్‌మన్ వెళ్లి కిటికీలోంచి చూడగా వేణుగోపాల్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసి చూపించాడు. దీనిపై రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించారు. శనివారం పోస్టుమార్టం అనంతరం పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : BREAKING: నిమిష ప్రియ విడుదలపై బిగ్ అప్డేట్.. కేఏ పాల్ సంచలన ప్రకటన!