Telangana crime : కొడుకు చేతిలో చిప్స్ పెట్టి లవర్తో జంప్.. దొరికిన ప్రేమ జంట!

నవీనకు గతంలోనే పెళ్లి కాగా , 15 నెలల బాబు కూడా ఉన్నాడు. భర్త, పిల్లాడు ఉన్నప్పటికీ నవీనకు ప్రియుడి మాటలే నచ్చాయి. అతనితో జీవించాలని అనుకుంది. ప్రియుడి మాటలకు పడిపోయి సర్వస్వం అతడే అనుకుంది.

New Update
lover

అమ్మతనానికే మచ్చతెచ్చేలా ఓ వివాహిత వ్యవహరించింది. కట్టుకున్న ఓ భర్తను, నవమాసాలు మోసిన కొడుకును కాదని కొన్ని నెలల క్రితం పరిచయం అయిన ప్రియుడితో వెళ్లిపోయేందుకు  సిద్ధమైంది. అది కూడా ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం అయిన ఓ వ్యక్తి కోసం. ఇంతకన్నా  దారుణం బహుశా సమాజంలో మరోకటి ఉండకపోవచ్చు. హైదరాబాద్‌కు చెందిన నవీనకు ఇన్‌స్టాలో నల్గొండ పాతబస్తీకి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. 

నవీనకు గతంలోనే పెళ్లి కాగా , 15 నెలల బాబు కూడా ఉన్నాడు. భర్త, పిల్లాడు ఉన్నప్పటికీ నవీనకు ప్రియుడి మాటలే నచ్చాయి. అతనితో జీవించాలని అనుకుంది. ప్రియుడి మాటలకు పడిపోయి సర్వస్వం అతడే అనుకుంది. ప్రియుడి ముందు పెళ్లి బంధం, పేగు బంధం తక్కువే అనిపించింది. నువ్వు వచ్చేయ్ అన్ని  నేను చూసుకుంటాను అని ప్రియుడి చెప్పగానే అతనితో వెళ్లిపోవడానికి రెడీ అయిపోయింది. ప్రియుడిని బస్టా్ండ్ కు రమ్మని పిలిచి అక్కడ పిల్లాడిని వదిలేసి ప్రియుడితో వెళ్లిపోవాలని స్కెచ్ వేసింది నవీన.  ప్లాన్ లో భాగంగా నల్లగొండ బస్టాండ్ కు వచ్చాక బాబుకు చిప్స్ ప్యాకెట్ కొనచ్చి సీట్లో కూర్చొబెట్టింది. పిల్లాడు చిప్స్ తింటుండగా  మెల్లిగా  అక్కడి నుంచి జారుకుని లవర్ తో బైకుపై వెళ్లిపోయింది. 

అమ్మ ఎక్కడా అని బిత్తరచూపులు

చిప్స్ అయిపోయాక పాపం పిల్లాడు అమ్మ ఎక్కడా అని బిత్తరచూపులు చూశాడు. అమ్మ కావాలనే వదిలేసిపోయిందన్న విషయం పాపం ఆ బుడ్డొడికి తెలియదు కదా.. ఎడవడం మొదలుపెట్టాడు. చూసిన ప్రయాణికులు,  ఆర్టీసీ సిబ్బంది ఆ బుడ్డొడి దగ్గరకు వెళ్లి ఓదార్చే ప్రయత్నం చేశారు.  ఎక్కడా కూడా బాబు తల్లి కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.  సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ఆమె బాబును వదిలేసి ప్రియుడితో బైక్ పై వెళ్లిపోయినట్లుగా గుర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సీసీ కెమెరాల ఆధారంగా ముందు తల్లి ఆనవాలు గుర్తించిన పోలీసులు ఆమె భర్తకు సమాచారమిచ్చి బిడ్డను అతనికి అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొన్ని గంటల్లోనే నవీన ఆమె ప్రియుడిని పట్టుకున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. 

Advertisment
తాజా కథనాలు