/rtv/media/media_files/2025/07/27/nimisha-priya-2025-07-27-19-57-01.jpg)
Nimisha Priya
కేరళ నర్సు నిమిష ప్రియ యెమెన్‌లో తలాల్ అబ్దో మెహదీని హత్య చేయడంతో అక్కడ ప్రభుత్వం ఉరిశిక్ష విధించింది. జులై 16వ తేదీన ఉరిశిక్ష పడనుండగా.. చివరి సమయంలో యెమెన్ స్థానిక అధికారులు ఆ ప్రక్రియను వాయిదా వేశారు. నిమిషను కాపాడాలని భారత ప్రభుత్వంతో పాటు కేఏ పాల్ కూడా ప్రయత్నిస్తున్నారు. నిమిష ప్రియ విడుదల కోసం ఆమె కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఇది కూడా చూడండి:Mansa Devi Temple: ఆరుగురి ప్రాణాలు తీసిన పుకార్లు.. తొక్కిసలాటకు కారణం ఇదే!
Yemen Prisoner Nimisha Priya’s only daughter Mishel , husband Thomas join Dr. K.A Paul , Chairman Mahdi, Jyoti Begal and Mamatha addressing the leader if Sanaaa Excellency Abdul Malik Al Houthi.@AlJazeera@Reuters@BBCWorld@ANI@PTI_News@TV9Telugu@NtvTeluguLive@ABC@CNNpic.twitter.com/5yGNNJFKgl
— Dr KA Paul (@KAPaulOfficial) July 27, 2025
ఇది కూడా చూడండి: Roshni Walia :సెక్స్ చెయ్.. ఎంజాయ్ చెయ్.. కానీ కండోమ్ యూజ్ చెయ్.. హీరోయిన్ సంచలనం
వినతీ పత్రాన్ని..
ఈ క్రమంలో నిమిష ప్రియ ఏకైక కుమార్తె మిషెల్, ఆమె భర్త థామస్, డాక్టర్ కె.ఎ. పాల్, మహదీ, జ్యోతి బెగల్, మమత ఇటీవల యెమెన్‌లో సనా నగరంలో హౌతీ నాయకుడు అబ్దుల్ మాలిక్ అల్ హౌతీని కలిశారు. ఈ భేటీలో నిమిష ప్రియను క్షమించి, ఆమెను విడుదల చేయాలని అల్ హౌతీని వారు వేడుకున్నారు. ఆమె విడుదల కోసం తమ వినతి పత్రాన్ని కూడా అందించారు.
ఇది కూడా చూడండి:Nose Infection: వర్షాకాలంలో ముక్కు అనారోగ్యానికి గురవుతుందా..? సకాలంలో జాగ్రత్త తీసుకోకపోతే..!!
నిమిష ప్రియ కేరళలో నర్సింగ్ కోర్సు పూర్తి చేసి 2008లో యెమెన్‌కు వెళ్లి అక్కడే జాబ్‌లో చేరింది. 2011లో కేరళకు వచ్చి థామస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత యెమెన్‌లోని ఓ క్లినిక్‌ను ప్రారంభించాలనుకుంది. అయితే ఆ దేశ రూల్స్ ప్రకారం స్థానిక వ్యక్తి వ్యాపార భాగస్వామ్యంతోనే ఇది సాధ్యమవుతుంది. ఇందుకోసం నిమిష అక్కడున్న తలాల్ అదిబ్ మెహది అనే వ్యక్తిని వ్యాపార భాగస్వామిగా చేసుకుంది. వీళ్లద్దరూ కలిసి మెడికల్ కౌన్సిల్ సెంటర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత నిమిష తన కూతురు సంప్రదాయ వేడుక కోసం భారత్‌కు వచ్చింది. అది ముగిశాక యెమెన్‌కు వెళ్లిపోయింది. నిమిష భర్త, కూతురు మాత్రం కేరళలోనే ఉండిపోయారు. దీన్ని ఆసరగా చేసుకొని మెహది.. నిమిష ప్రియ నుంచి డబ్బు లాక్కునేవాడని, వేధించేవాడని ఆమె కుటుంబం ఆరోపించింది.
ఆఖరికి ఆమె పాస్‌పోర్టును కూడా లాక్కున్నాడని చెప్పారు. దీంతో నిమిష.. తన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకునేందుకు 2017లో మెహదికి మత్తుమందు ఇచ్చింది. కానీ డోస్ ఎక్కువైపోవడంతో అతడు మృతి చెందాడు. దీంతో అతడి మృతదేహాన్ని ఆమె వాటర్ ట్యాంక్‌లో పడేసింది. చివరికి ఆమె సౌదీకి వెళ్తుండగా.. సరిహద్దుల్లో ఆమెను అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టు నిమిష ప్రియకు ఉరిశిక్ష విధించింది. అయితే మృతుడి ఫ్యామిలీకి కొంత మొత్తాన్ని పరిహారంగా ఇస్తే దోషులను క్షమించి వదిలేసే అవకాశం యెమెన్‌లో ఉంది. ఇందుకోసం భారీ మొత్తంలో డబ్బు వారికి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే నిమిష ప్రియ కుటుంబం మిలియన్ డాలర్లు అంటే రూ.8.6 కోట్లు బాధిత కుటుంబానికి ఇచ్చేందుకు సిద్ధమయ్యింది. కానీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.