60 ఏండ్ల కళ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేళ మోదీ నుంచి రేవంత్ వరకు నేతల ట్వీట్లు వైరల్!

నేడు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రధాని మోదీ, రాహుల్, సీఎం రేవంత్, చంద్రబాబు, కేటీఆర్ ఇలా అందరు ట్వీట్లు చేశారు.

New Update
Telangana Formation Day 2025

Telangana Formation Day 2025

TG Formation Day 2025: తెలంగాణ ప్రజల 60 ఏండ్ల కళ నిజమైన రోజు, దశాబ్దాల కలలు, ఆశయాలు ఫలించిన రోజు తెలంగాణ అవతరణ దినోత్సవం.  జూన్ 2న స్వరాష్ట్రం ఏర్పడిన సందర్భంగా ప్రతి ఏడాది ఈరోజున రాష్ట్రవ్యాప్తంగా  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ (TG Formation Day 2025)  వేడుకలను జరుపుకుంటారు.  వందల మంది విద్యార్థులు ఆత్మబలిదానం, అమరవీరుల త్యాగాలు, ఉద్యమకారుల సాయుధ పోరాటానికి ప్రతిఫలమే ఈ తెలంగాణ. ఈ మేరకు రాజకీయ నాయకులు, ప్రముఖులు  రాష్ట్ర  ‌ప్ర‌జ‌లంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. 

నేతల ట్వీట్లు

బీఆర్ఎస్ నేత కేటీఆర్ తెలంగాణ 60 ఏండ్ల కళ అంటూ ట్వీట్ చేశారు. 

కేసీఆర్ కూతురు బీఆర్ఎస్ నాయకురాలు కవిత స్వరాష్ట్రం కోసం కేసీఆర్ ఉద్యమస్ఫూర్తితో పోరాడిన సకల జనులకు ఉద్యమాభివందనాలు అని తెలిపారు. 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.  

ప్రధాని మోదీ సైతం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.  

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తెలుగు రాష్ట్రాలు వేరైనా తెలుగు ప్రజలు, జాతి ఒక్కటే అంటూ ట్వీట్ చేశారు. 

డిప్యూటీ సీఎం పవన్ తనలో ఉద్యమ స్ఫూర్తి నింపిన నేల, తెలంగాణ కోటి రత్నాల వీణ అని ట్వీట్ చేశారు. 

కాంగ్రెస్ నేత రాహుల్ కూడా రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.  

Also Read: మమతా పాలనలో దారుణాలు.. బెంగాల్‌లో అధికారం మాదే: అమిత్ షా

Advertisment
Advertisment
తాజా కథనాలు