Rajendra Prasad: నేను అలాగే మాట్లాడుతా.. అది మీ ఖర్మ .. రాజేంద్రప్రసాద్ రియాక్షన్ ఇదే!

నటుడు రాజేంద్రప్రసాద్ కమెడియన్ అలీని ల****కు అని దూషించడంపై స్పందించారు. తాను ఎప్పుడైనా సరదాగా అలా మాట్లాడతానని.. అది అవతల వాళ్ళు తీసుకునే సంస్కారాన్ని బట్టి ఉంటుందని తెలిపారు.

New Update
rajendra prasad viral comments on ali

rajendra prasad viral comments on ali

Rajendra Prasad:  సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇటీవలే డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో కమెడియన్ అలినీ ఓ బూతు పదంతో ప్రస్తావించడం నెట్టింట చర్చనీయాంశమైంది. ఒక సీనియర్ నటుడు స్టేజిపై మాట్లాడాల్సిన మాటలా ఇవి..? అంటూ విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా తన వ్యాఖ్యలపై స్పందించారు నటుడు రాజేంద్రప్రసాద్. 

Also Read :  పార్టీతో సంబంధాలు తెంపుకుంటూ.. కవిత నేడు ప్రకటించిన రూట్‌మ్యాప్ ఇదే..!

అది మీ సంస్కారం

రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. నేను అందరితో సరదాగా ఉంటాను.. అలాగే అవతలి వాళ్ళు కూడా నాతో సరదాగా ఉంటారు. ఈ మధ్య కొన్ని ఈవెంట్లలో వాళ్ళు.. నావాళ్ళు అనే ఉద్దేశంతో పొరపాటున అనేసిన మాటలను కొందరు తప్పు అని అంటున్నారు.  నేను ఇలాగే ఉంటాను.. నేనేంటో అందరికీ తెలుసు. సరదాగా ఫ్లోలో అనేసిన మాటలను తప్పుగా తీసుకుంటే.. అది మీ సంస్కారం అని తెలిపారు.

Also Read: Chiranjeevi: కమెడియన్ అలీకి మెగాస్టార్ సర్ప్రైజ్ గిఫ్ట్.. భార్య జుబేదా వీడియో వైరల్

అసలేం జరిగింది.. 

అయితే తాజాగా  దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించగా పలువురు  సినీ ప్రముఖులు హాజరయ్యారు. అందులో నటుడు రాజేంద్ర ప్రసాద్ (Rajendra prasad) కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ స్టేజ్ పై ప్రసంగిస్తూ.. కమెడియన్ అలీపై (Comedian Ali) నోరు పారేసుకున్నారు. సరదాగా మాట్లాడుతున్న క్రమంలో కమెడియన్ అలీని ల***** అని సంబోధించారు.  ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజేంద్ర ప్రసాద్ తీరుపై నెటిజన్లు తీవ్ర  విమర్శలు చేశారు. ఒక సీనియర్ నటుడు స్టేజ్ పై ఇలాంటి మాట్లాడడం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read: HHVM Trailer: పవన్ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మ.. ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ వచ్చేస్తుంది!

Advertisment
Advertisment
తాజా కథనాలు