నలుగురు పిల్లల్ని కంటే రూ.లక్ష.. బ్రాహ్మణ దంపతులకు బంపర్ ఆఫర్..

మధ్యప్రదేశ్‌లో బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన పరుశురామ్‌ కల్యాణ్ బోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నలుగురు పిల్లల్ని కనే బ్రాహ్మణ దంపతులకు రూ.లక్ష నజరానా ఇస్తామని ప్రకటించింది. ప్రస్తుతం బ్రాహ్మణుల జనాభా తగ్గిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Update
new born baby and Brahmin Community Chief

new born baby and Brahmin Community Chief

మధ్యప్రదేశ్‌లో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. బ్రాహ్మణ కమ్యూనిటీ తమ జనాభాను పెంచుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. నలుగురు పిల్లల్ని కనే దంపతులకు రూ.లక్ష నజరానా ఇస్తామని ఆ కమ్యూనిటీకి చెందిన పరుశురామ్‌ కల్యాణ్ బోర్టు ప్రకటన చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని పరశురామ్ కల్యాణ్ బోర్డు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తోంది. అయితే బ్రాహ్మణ కుటుంబాల సంఖ్య తగ్గిపోతుండటంతో ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ఈ బోర్డు ప్రకటన చేసింది. 

Also Read: దేవుళ్లు, రాక్షసుల మధ్య యుద్ధం జరిగితే.. కుంభమేళ ఎందుకొచ్చిందంటే..?

భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రంలో పరుశురామ్ కల్యాణ్ బోర్డు అధ్యక్షుడు పండిత్ విష్ణు రాజోరియా మాట్లాడారు. మనం మన కుటుంబాలపై దృష్టి పెట్టడం మానేశామని ఆందోళన వ్యక్తం చేశారు. ఈమధ్య కాలంలో యువత ఒక బిడ్డను కని ఆగిపోతున్నారని తెలిపారు. ప్రస్తుతం ఇది సమస్యాత్మకంగా మారుతోందని.. భవిష్యత్‌ తరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందని పేర్కొన్నారు. 

Also Read: అసలు మనిషేనా వీడు.. గిరిజన విద్యార్థినులు చేత టాయిలెట్లు కడిగించాడు!

అందుకే కనీసం నలుగురు సంతానం ఉండాలని కోరుతున్నాని చెప్పారు. నలుగురు పిల్లల్ని కనే మహిళకు పరుశురామ్ కల్యాణ్ బోర్డు తరఫున రూ.లక్ష నజరానా అందిస్తామని ప్రకటించారు. అంతేకాదు తాను బోర్డు అధ్యక్షుడిగా పదవి నుంచి దిగిపోయాకా కూడా ఈ నజరానా అవార్డు కొనసాగుతూ ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఈ అంశం స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. 

Also Read: గత 48 గంటల్లో 85 లక్షల మంది పుణ్యస్నానాలు.. చరిత్రలో అతి పెద్ద ఉత్సవంగా కుంభమేళ

Also Read: ఒక దేశ జనాభా అంత జనం.. 6 పార్లమెంట్లు కట్టే అంత ఖర్చు.. కుంభమేళా హైలైట్స్ ఇవే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు