LPG Tanker Blast: గ్యాస్ ట్యాంకర్ పేలి ఏడుగురు మృతి.. ఎక్కడో తెలుసా?

పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండ్యాలా గ్రామం సమీపంలో LPG ట్యాంకర్ ఒక పికప్ వాహనాన్ని ఢీకొట్టడంతో భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి.

New Update
LPG tanker in Punjab

LPG tanker in Punjab

LPG Tanker Blast:

పంజాబ్‌లోని(Punjab) హోషియార్‌పూర్ జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండ్యాలా గ్రామం సమీపంలో LPG ట్యాంకర్ ఒక పికప్ వాహనాన్ని ఢీకొట్టడంతో భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మండియాలా గ్రామం సమీపంలోని జలంధర్-హోషియార్‌పూర్ రోడ్డుపై రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక పికప్ వాహనం LPG ట్యాంకర్‌ను ఢీకొనడంతో గ్యాస్ లీక్ అయింది. క్షణాల్లోనే మంటలు చెలరేగి భారీ పేలుడు సంభవించింది. ఈ మంటలు దాదాపు 30 దుకాణాలను, 20 ఇళ్లను చుట్టుముట్టాయి. నిద్రిస్తున్న కొందరు గ్రామస్తులు కూడా ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు.

Also Read: వావ్.. వాటే కాన్సెప్ట్..! రోబో కుక్కలతో ఫుడ్ డెలివరీ.. ఎక్కడంటే..?

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళాలు, అంబులెన్సులు, పంజాబ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని హుటాహుటిన హోషియార్‌పూర్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని మెరుగైన చికిత్స కోసం ఇతర ఆసుపత్రులకు పంపించారు. ప్రాణనష్టం, ఆస్తి నష్టం తీవ్రంగా ఉండటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read:2 నిమిషాలు.. 15 బిలియన్‌ వ్యూస్.. యూట్యూబ్‌ను షేక్ చేసిన టాప్ వీడియోలు ఇవే..!

ఈ దుర్ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. అంతేకాకుండా, గాయపడిన వారికి ఉచిత వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తుకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారిలో ఎల్‌పిజి ట్యాంకర్ డ్రైవర్ సుఖ్‌జీత్ సింగ్, స్థానికుడు బల్వంత్ రాయ్ ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా సుమారు మూడు గంటల పాటు జలంధర్-హోషియార్‌పూర్ రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది. వరద సహాయక చర్యల పర్యవేక్షణకు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) బృందాలను కూడా రంగంలోకి దించారు.

Advertisment
తాజా కథనాలు