AI Robo Dogs Food Delivery: వావ్.. వాటే కాన్సెప్ట్..! రోబో కుక్కలతో ఫుడ్ డెలివరీ.. ఎక్కడంటే..?

జ్యూరిక్‌లో Just Eat, RIVR అనే రోబోటిక్స్ సంస్థ కలసి AI ఆధారిత రోబో కుక్కలతో ఫుడ్ డెలివరీ ప్రారంభించాయి. ఇవి మెట్లు ఎక్కడం, ముందున్న అడ్డంకులు దాటడం లాంటివి చేస్తూ వేగంగా డెలివరీ చేస్తాయి. భవిష్యత్తులో యూరోప్‌లో ఇతర నగరాల్లో కూడా ఈ టెక్నాలజీ రానుంది.

New Update
AI Robo Dogs Food Delivery

AI Robo Dogs Food Delivery

AI Robo Dogs Food Delivery: స్విస్ నగరం జ్యూరిక్‌లో ఓ కొత్త తరహా ఫుడ్ డెలివరీ ప్రారంభమైంది. ఇప్పుడు మనకు ఫుడ్ డెలివరీ చేయడానికి మనుషులు కాకుండా, రోబో కుక్కలు వస్తున్నాయంటే ఆశ్చర్యమే కదా! Just Eat Takeaway.com అనే డచ్ ఫుడ్ డెలివరీ కంపెనీ, స్విట్జర్లాండ్‌కి చెందిన RIVR అనే రోబోటిక్స్(Swiss Robotics Company) సంస్థతో కలిసి ఈ సరికొత్త టెక్నాలజీని తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఈ ప్రాజెక్ట్‌ని మొదట జ్యూరిక్‌లో ప్రారంభించారు. Zekis World అనే స్థానిక రెస్టారెంట్ నుండి ఫాస్ట్ ఫుడ్‌ను ఇలాంటి రోబో కుక్కలతో డెలివరీ చేస్తుండగా, త్వరలోనే ఈ సేవలను ఇతర యూరోప్ నగరాలకు విస్తరించాలనే ఉద్దేశంతో ఉన్నారు.

Also Read:Vivo V29 Pro 5G అరాచకం.. బడ్జెట్ ధరలో అల్ రౌండర్..!

ఫిజికల్ AI తో రోబో కుక్కలు

ఈ రోబో కుక్కలు నడిచే చక్రాలతో పాటు నాలుగు కాళ్లు కూడా కలిగి ఉంటాయి. వాటిలో ఫిజికల్ AI అనే ప్రత్యేకమైన సాంకేతికత ఉంది, దీని ద్వారా అవి సొంతంగా మార్గాన్ని గుర్తించి, ముందున్న అడ్డంకులను తప్పించుకుంటూ ముందుకెళ్లగలవు. ట్రాఫిక్‌, పాదచారులు, రోడ్డు పక్కన ఉన్న చెత్త బుట్టలు, మెట్లు వంటి వాటిని అవి దాటగలుగుతాయి.

రోబో కుక్కలు గంటకు 15 కిలోమీటర్ల వేగంతో నడవగలవు. వర్షం, మంచు, గాలి, ఎండ వంటి వాతావరణ పరిస్థితుల్లోనూ అవి పనిచేస్తాయి. ప్రతి డెలివరీని రియల్ టైమ్‌లో పర్యవేక్షించడానికి వీలుగా డిజైన్ చేశారు. అవసరమైతే ఈ రోబోను రిమోట్ ద్వారా నియంత్రించవచ్చు కూడా.

Also Read: ఇక మనిషికి చావు ఉండదా?.. వృద్ధులను యువకులుగా మార్చేయనున్న AI

భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు.. 

ఈ రోబో కుక్కలు ప్రస్తుతం ఫాస్ట్ ఫుడ్‌ను డెలివరీ చేస్తున్నప్పటికీ, భవిష్యత్తులో పార్సెల్లు, కిరాణా సరుకులు, ఇతర వస్తువులు పంపేందుకు కూడా ఉపయోగించాలన్న లక్ష్యంతో ఉన్నారు. RIVR CEO మార్కో బెలొనిక్ మాట్లాడుతూ, "ఈ ప్రాజెక్ట్ మన నగరాల్లో ఆటోమేషన్ ఎలా సహజంగా కలిసిపోతుందో చూపుతుంది. మా ఫిజికల్ AI టెక్నాలజీ వల్ల రోబోలు నిజమైన ప్రపంచాన్ని అర్థం చేసుకుని స్పందించగలుగుతున్నాయి" అని చెప్పారు.

అలాగే Just Eat కంపెనీ, ఐర్లాండ్‌లో డ్రోన్‌లతో ఫుడ్ డెలివరీ కూడా పరీక్షించింది. ఇప్పుడు రోబో కుక్కల ద్వారా డెలివరీ చేయడం ద్వారా, వారు టెక్నాలజీని మరింతగా అడ్వాన్స్ గా వినియోగిస్తున్నారు.

ఈ సరికొత్త ప్రయత్నం నగరాల్లో డెలివరీ విధానాలను పూర్తిగా మార్చే అవకాశముంది. త్వరలోనే మరిన్ని యూరోపియన్ నగరాల్లో కూడా ఈ ఫుడ్ డెలివరీ రోబోలు నడవడం చూస్తామేమో!

Advertisment
తాజా కథనాలు