Rangareddy District: బాలుడి ప్రాణం తీసిన స్కూల్ గేట్..

సరదాగా స్కూల్ గేట్‌తో ఊగి ఆడుతుండగా అది ఊడిపడి ఏడేళ్ల బాలుడు కోల్పోయిన విషాద ఘటన హయత్‌నగర్‌లో చోటుచేసుకుంది. గేట్ తుప్పు పట్టడంతో ఒక్కసారిగా ఊడిపడటంతో ఊపిరి ఆడక అజయ్ అనే విద్యార్థి అక్కడిక్కడే మరణించాడు.

New Update
Rajasthan: కోటాలో ఆగని ఆత్మహత్యలు.. మరో విద్యార్థి బలవన్మరణం..

స్కూల్ అయిపోయిన తర్వాత సరదాగా ఆడిన ఆట బాలుడి ప్రాణాలను తీసిన విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లాకి చెందిన ఆలకుంట చందు, సరోజ దంపతులు హయత్‌నగర్‌లో ఉంటున్నారు. వీరికి ఏకైక సంతానమైన ఏడేళ్ల అజయ్ అనే కుమారుడు ఉన్నాడు. బతుకు తెరువు కోసం హయత్‌నగర్‌లోని ముదిరాజ్ కాలనీలో ఉంటున్నారు.

ఇది కూడా చదవండి: జగన్‌కు దెబ్బ మీద దెబ్బ.. ఆ ఇద్దరు కీలక నేతలు జంప్!

గేట్ దగ్గర ఆడుతుండగా..

భార్యాభర్తలు జీహెచ్‌ఎంసీలో స్వచ్ఛ ఆటో ద్వారా ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. అజయ్‌ హయత్‌నగర్‌లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల దగ్గర ఉన్న ప్రాథమిక స్కూల్‌లో ఒకటో తరగతి చదువుతున్నాడు. అందరిలానే రోజూ స్కూల్‌కి అజయ్ వెళ్లాడు. సాయంత్రం 3:45 గంటలకు స్కూల్ కూడా పూర్తయ్యింది. అలా ఇంటికి వెళ్లడానికి బయటకు వస్తుండగా.. స్కూల్ గేట్ దగ్గర పిల్లలు ఆడుకోవడం చూశాడు.

ఇది కూడా చదవండి: హోంమంత్రి అనితపై పవన్ సీరియస్.. ఇక ఊరుకోనంటూ..

దీంతో ఇంటికి వెళ్లడానికి వ్యాన్ ఎక్కకుండా ఆ గేట్ ఎక్కి  ఊగాడు. ఆ బాలుడు ఎక్కినప్పుడు ఆ గేట్ ఒక్కసారిగా ఊడిపోయి అజయ్ మీద పడింది. దీంతో అజయ్‌కి ఊపిరి ఆడక వెంటనే సొమ్మసిల్లి కింద పడిపోయాడు.అజయ్‌ను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లిన ఫలితం లేకపోయింది.

ఇది కూడా చూడండి: USA: అమెరికా ఎన్నికలు...న్యూయార్క్ బ్యాలెట్ పేపర్లో బెంగాలీ

 అప్పటికే అజయ్ మరణించాడు. మరో విద్యార్థికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ స్కూల్ గేట్ బాగా తుప్పు పట్టింది. ముందు కొందరు పిల్లలు ఊగి వెళ్లినప్పుడు కాస్త ఊడిపోగా, అజయ్ ఎక్కినప్పుడు మొత్తం ఊడిపోయినట్లు తెలుస్తోంది. ఉదయం సరదాగా స్కూల్‌కి వెళ్లిన కుమారుడు సాయంత్రం ఇంటికి శవమై తిరిగి రావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఇది కూడా చూడండి: అమెరికా ఎన్నికలు ఎలా జరుగుతాయి..బ్యాలెట్ పేపర్‌‌లో ఉండే అంశాలేంటి?

Advertisment
Advertisment
తాజా కథనాలు