Crime: అయ్యో .. కూతురి అప్పగింతలు చేస్తూ.. ఆగిపోయిన తల్లి గుండె! పెళ్లి వేడుకలో విషాదం

కూతురి అప్పగింతలు చేస్తూ తీవ్ర భావోద్వేగానికి గురైన తల్లి గుండెపోటుతో కుప్పకూలింది. ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. ఈ హృదయ విదారక ఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం అబ్బాసుపురం గ్రామంలో చోటుచేసుకుంది.

New Update
heart attack

heart attack

Crime: అది కూతురికి ఘనంగా పెళ్లి చేసి.. అత్తారింటికి పంపిస్తున్న సమయం. కానీ ఇంతలోనే ఆ పెళ్లి మండపంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కూతురి అప్పగింతలు చేస్తూ తీవ్ర భావోద్వేగానికి గురైన తల్లి గుండెపోటుతో కుప్పకూలింది. ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. ఈ హృదయ విదారక ఘటన ఖమ్మం(Khammam) జిల్లా కామేపల్లి మండలం అబ్బాసుపురం గ్రామంలో చోటుచేసుకుంది.

Also Read: అడ్డంగా దొరికిపోయిన భార్య, ప్రియుడు.. భర్త మర్డర్ కి స్కెచ్చేస్తే షాకింగ్ ట్విస్ట్!

అప్పగింతలు చేస్తూ.. 

 వివరాల్లోకి వెళితే.. . అబ్బాసుపురం గ్రామానికి చెందిన  కల్యాణి, బానోత్‌ మోహిలాల్‌ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే పెద్ద కుమార్తె  సింధు వివాహం టేకులపల్లి గ్రామానికి  చెందిన బాలాజీతో ఆదివారం ఉదయం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లి వేడుక సందడిగా సాగింది. కానీ, ఇంతలోనే ఊహించని సంఘటన ఆ కుటుంబాన్ని విషాదంలో ముంచెత్తింది.

వివాహం అనంతరం సాయంత్రం కూతురి అప్పగింతలు చేస్తూ తల్లి కళ్యాణి తీవ్ర భావోద్వేగానికి గురైంది.  అల్లుడు, కూతురిని  పట్టుకొని బాగా ఏడ్చేసింది. ఈ క్రమంలోనే ఆమె  హఠాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది.  దీంతో పెళ్లి ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. కూతురు తమను విడిచి అత్తారింటికి వెళ్తుందనే బాధ తట్టుకోలేక ప్రాణాలు విడిచిన ఆ తల్లి ప్రేమ అందరినీ కంటతడి పెట్టించింది.  20 ఏళ్ళు పాటు అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురికి పెళ్లి చేసి  అత్తారింటికి పంపేటప్పుడు ఆ తల్లిదండ్రుల బాధ చెప్పలేనిది! ఓ వైపు కూతురిని ఒక అయ్య చేతిలో పెట్టామనే సంతోషం.. మరోవైపు కూతురు వెళ్ళిపోతుందనే దుఃఖం. ఇది ఆడపిల్లను కన్న  ప్రతిఒక్క అమ్మానాన్నకి ఎప్పటికీ  తీరని భాద.

Also Read: Manchu Manoj: కలిసిపోయిన మంచు విష్ణు, మనోజ్.. కొడుకుకి అవార్డు వేళ  'అన్నా' అంటూ పోస్ట్ !

Advertisment
తాజా కథనాలు