రంగులు చల్లవద్దు అన్నందుకు స్నేహితుడిని దారుణంగా.. ఏం చేశారంటే?

హోలీ రంగులు చల్లవదన్నందుకు స్నేహితుడిని చంపేసిన ఘటన రాజస్థాన్‌లో జరిగింది. హన్సరాజ్ అనే యువకుడు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఈ సమయంలో ముగ్గురు స్నేహితులు రంగులు వేయడానికి వస్తే.. వద్దని వేడుకున్నాడు. దీంతో స్నేహితులు హన్సరాజ్‌ను చంపేశారు.

New Update
holi colors

holi colors

ఇప్పటికే దేశంలోని పలు చోట్ల హోలీ వేడుకలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తనపై రంగులు చల్లోద్దంటూ వారించిన ఓ 25 ఏళ్ల యువకుడిని ముగ్గురు దారుణంగా హత్య చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం హన్సరాజ్ అనే యువకుడు ప్రిపేర్ అవుతున్నారు. ఈ సమయంలో అశోక్, బబ్లు, కలురామ్ అనే ముగ్గురు హోలీ ఆడుకుంటున్నారు.

ఇది కూడా చూడండి: Russia-Trump: ఒప్పందం పై పుతిన్‌ అనుకూల వ్యాఖ్యలు..ఒకవేళ తిరస్కరిస్తే అంటున్న ట్రంప్‌!

ఒంటిపై రంగులు వేయవద్దన్నందుకు..

నాపై రంగులు చల్లవద్దని.. స్నేహితులను హన్సరాజ్ వేడుకున్నాడు. అయినా వినకుండా అతడిపై రంగు చల్లడంతోపాటు దాడికి పాల్పడ్డారు. బెల్తుతో అతడ్ని తీవ్రంగా కొట్టారు. ఈ క్రమంలో ముగ్గురు నిందితుల్లో ఒకడు.. హన్సరాజ్ గొంతునులిమి చంపినట్లు పోలీసలు గుర్తించారు. హన్సరాజ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

ఇది కూడా చూడండి: Horoscope Today: నేడు ఈ రాశి వారు అతిగా మాట్లాడకుండా ఉంటే బెటర్‌!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు