Paster Praveen: ప్రవీణ్‌ హత్యకు రూ.5 కోట్లే కారణం? సయ్యద్ హుస్సేనీ సంచలనం!

పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో సంచలనాలు బయటకొచ్చాయి. రూ.5 కోట్లతో రాజమండ్రిలో ప్రవీణ్ బైబిల్ కాలేజీ కడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ 5 కోట్లు ఏమయ్యాయి? ఆ డబ్బుల కోసమే ప్రవీణ్ హత్య జరిగి ఉండొచ్చంటూ సయ్యద్ సమీ హుస్సేనీ సంచలన ఆరోపణలు చేశారు. 

New Update

Paster Praveen: మిస్టరీగా మారిన పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో మరిన్ని సంచలనాలు బయటకొచ్చాయి. పోలీసులు- వివిధ కోణాల్లో కేసును లోతుగా దర్యాప్తు చేస్తుండగా -ప్రవీణ్ మరణంపై సయ్యద్ సమీ హుస్సేనీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ముందు ప్రమాదమన్నారు? ఆ తర్వాత హత్య అంటున్నారు? ప్రవీణ్ వచ్చి వెళ్లే విషయం ఎవరెవరికి తెలుసంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. 

ఆ డబ్బుల కోసమే ప్రవీణ్ హత్య.. 

రూ.5 కోట్లతో రాజమండ్రిలో ప్రవీణ్ బైబిల్ కాలేజీ కడుతున్నాడని ప్రచారం జరుగుతోంది. మరి- రూ.5 కోట్లు ఏమయ్యాయి? ఆ డబ్బుల కోసమే- ప్రవీణ్ హత్య జరిగి ఉండొచ్చు. ల్యాండ్ కొనేందుకు ప్రవీణ్‌ ఎవరికి డబ్బులు ఇచ్చారు? పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ వస్తే నిజాలు తెలుస్తాయి. ప్రవీణ్ మరణంతో నాకు ఎలాంటి సంబంధం లేదంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుం ఆయన వ్యాఖ్యలు ఉత్కంఠ రేపుతున్నాయి.

Also Read: NTR Japan Fan: ఇదేం క్రేజ్ రా బాబు.. NTRతో గలగలా తెలుగు మాట్లాడిన జపాన్ ఫ్యాన్.. వీడియో వైరల్!

ఇదిలా ఉంటే.. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. ఆయన ఎలా చనిపోయారు అన్న అంశంపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపు పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఈ రోజు సాయంత్రం ప్రవీణ్ పోస్టుమార్టానికి సంబంధించి నివేదిక రానుంది. పోస్టుమార్టం రిపోర్టుతో మరింత సమాచారం వచ్చే ఛాన్స్ ఉంది. కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్సైలతో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. ప్రవీణ్ విజయవాడ నుంచి రాజమండ్రి వచ్చే సమయంలో ఏం జరిగిందనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: Bharat-America:అమెరికా నుంచి సాయం ఆగిపోతే కనుక ...10 లక్షల మరణాలు !


 case | today telugu news 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు