NTR Japan Fan: ఇదేం క్రేజ్ రా బాబు.. NTRతో గలగలా తెలుగు మాట్లాడిన జపాన్ ఫ్యాన్.. వీడియో వైరల్!

'దేవర' ప్రమోషన్స్ లో ఓ జపాన్ అభిమాని తెలుగు మాట్లాడి ఎన్టీఆర్ ని ఆశ్చర్యపరిచింది. అన్నా .. ''అన్నా నేను RRR సినిమా చూశాక తెలుగు నేర్చుకున్నాను అంటూ తెలుగులో మాట్లాడింది. ఇందుకు సంబంధించిన వీడియోను తారక్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 

New Update

NTR Japan Fan:  జూనియర్ ఎన్టీఆర్  'దేవర' మార్చి 28న జపాన్ లో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తారక్ , డైరెక్టర్ కొరటాల శివ ప్రమోషన్స్ లో భాగంగా జపాన్ వెళ్లి అక్కడ సందడి చేస్తున్నారు. ఇటీవలే ఎన్టీఆర్ ‘ఆయుధ పూజ’ పాటకు ఎన్టీఆర్ జపాన్ ఫ్యాన్ తో కలిసి స్టెప్పులేసిన వీడియో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తారక్ షేర్ చేసిన మరో వీడియో ట్రెండ్ అవుతోంది. 

RRR చూసి తెలుగు నేర్చుకున్నాను.. 

అయితే  ప్రమోషన్స్ లో భాగంగా తారక్ తో ఆటోగ్రాఫ్ కోసం వచ్చిన ఓ జపాన్ అభిమాని తెలుగు మాట్లాడి ఎన్టీఆర్ ని ఆశ్చర్యపరిచింది. అన్నా .. ''అన్నా నేను RRR సినిమా చూశాక తెలుగు నేర్చుకున్నాను. రెండు సంవత్సరాల నుంచి తెలుగు నేర్చుకుంటున్నాను అంటూ.. ఆమె తెలుగు రాసిన పుస్తకాన్ని చూపించింది. ఇది చూసిన ఎన్టీఆర్ ఫిదా అయ్యారు. ''మీరు నిజంగా ఒక స్ఫూర్తి'' అంటూ ఆ మహిళా అభిమానుని కొనియాడారు. ఇందుకు సంబంధించిన వీడియోను తారక్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా గతేడాది విడుదలైన  'దేవర' బాక్స్ ఆఫీస్ భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ కలక్షన్ల వర్షం కురిపించింది.  రూ.500 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు దేవర జపాన్ ఫ్యాన్స్ కోసం ఈ నెల 28న జపనీస్‌లో విడుదల చేస్తున్నారు. 

telugu-news | devara japan release

Also Read: UGADI 2025: క్షణాల్లో ఉగాది పచ్చడి రెడీ .. బ్యాచిలర్స్ కూడా తయారు చేసేయొచ్చు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు