/rtv/media/media_files/2025/04/24/iWZfadLJXG7pFy2GtIyP.jpg)
pahalgam attack
జమ్మూకశ్మీర్ పహల్గాంలో జరిగిన భారీ ఉగ్రదాడిలో 28 మంది మృతి చెందారు. వీరిలో కొత్తగా పెళ్లయిన వారు కూడా ఉన్నారు. కుటుంబ సభ్యులతో ఎంతో సరదాగా గడుపుదామని వెళ్లిన కుటుంబాలు ఉగ్రదాడికి బలి అయ్యాయి. సహచరులను కళ్ల ముందే కోల్పోవడంతో కొందరు భయానికి గురయ్యారు. అయితే వీరిలో కొంత మంది ప్రాణాలతో బయటపడ్డారు.
ఇది కూడా చూడండి: Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?
ప్రాణాలు అరచేత పట్టుకుని..
అందులో విశాఖకు చెందిన చంద్రమౌళి దంపతులు ఒకరు. వీరితో పాటు మరో రెండు జంటలు జమ్మూకశ్మీర్ పర్యటనకు వెళ్లాయి. అక్కడ వీరి కళ్లముందే మోకాళ్లపై కూర్చోబెట్టి మరి దారుణంగా కాల్చి చంపారు. ప్రాణాలు అరచేత పట్టుకుని.. భయంతో చెట్ల పొదళ్లు దాక్కోని ఉగ్రదాడి నుంచి బయటపడినట్లు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: PM Modi: వారిని మట్టిలో కలిపేస్తాం.. ఇక యుద్ధమే: మోదీ సంచలన ప్రకటన
ఇదిలా ఉండగా.. బాధితులు కాళ్లు పట్టుకుని, చేతులెత్తి దండం పెట్టిన వదల్లేదు. ఈ ఉగ్రదాడిలో 35 ఏళ్ల భరత్ భూషణ్ తన ప్రాణాలు కోల్పోయాడు. అందరినీ కాల్చేస్తూ ఓ ఉగ్రవాది తమ వద్దకు రాగా.. తనకు మూడేళ్ల చిన్నారి ఉన్నందున విడిచిపెట్టాలని భరత్ భూషణ్ వారిని కోరినా పట్టించుకోకుండా తన భర్తను మూడు నిమిషాల పాటు అతి దారుణంగా కాల్చేశాడని భరత్ భార్య సుజాత వాపోయింది. భరత్ భూషణ్ భార్య సుజాత భూషణ్ ప్రముఖ డాక్టర్. ఈ దంపతులకు మూడేళ్ల చిన్నారి ఉంది. బెంగళూరులో స్థిరపడిన వీరంతా 2025 ఏప్రిల్ 18న విహారయాత్ర కోసమని కశ్మీర్ వెళ్లారు.
ఇది కూడా చూడండి: Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?
ఏప్రిల్ 23న బెంగళూరుకు తిరిగి వెళ్లాల్సి ఉండగా.. మంగళవారం మధ్యాహ్నం పహల్గాం సమీప ప్రాంతానికి వెళ్లి అక్కడ సరదాగా తమ చిన్నారితో గడిపారు. అప్పుడు అకస్మాత్తుగా కాల్పలు శబ్ధాలు రావడంతో వెంటనే ముగ్గురం పక్కనే ఉన్న గుడారాల వెనుక దాక్కున్నారు. ఇది గమనించిన ఓ ఉగ్రవాది తమ దగ్గరికి వచ్చాడని సుజాత తెలిపారు. తన భర్త ఆ ఉగ్రవాదిని ‘‘నాకు ఒక బిడ్డ ఉంది. దయచేసి నన్ను వదిలేయండి’ అని అడిగాడు. అయినప్పటికీ ఆ ఉగ్రవాది కనికరించలేదు. తన భర్త తలపై కాల్చి చంపి వెళ్లిపోయాడంటూ సుజాత కన్నీటి పర్యాంతమైంది.
ఇది కూడా చూడండి: New Smartphone: శాంసంగ్ M56 5G ఫస్ట్ సేల్ షురూ.. భారీ డిస్కౌంట్- ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!