ముంబైలో దారుణం.. యువతి బట్టలు విప్పించి డిజిటల్ అరెస్ట్..
ముంబైకి చెందిన ఓ యువతిపై మనీలాండరింగ్ కేసు ఉందని డిజిటల్ అరెస్ట్ పేరుతో కొందరు కేటుగాళ్లు రూ.1.78 లక్షలు కొట్టేశారు. ఇంతటితో ఆగకుండా బాడీ వెరిఫికేషన్ చేయాలంటూ బట్టలు విప్పించారు. పదే పదే ఇలా చేయడంతో యువతికి అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించింది.