ఇంత దారుణమా.. మానసిక వృద్ధురాలిపై హింస

ఒడిశాలో ఓ వృద్ధ మహిళపై ఆశ్రమ యాజమాన్యం దారుణానికి పాల్పడ్డింది. మానసిక సమస్యలతో బాధపడుతున్న వృద్ధురాలిని ఇద్దరు వ్యక్తులు కాలితో తన్ని, కర్రతో కొట్టి హింసించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకున్నారు.

New Update
Odisha

Odisha Photograph: (Odisha)

ఒడిశాలో ఓ ఆశ్రమంలో మానసిక రోగుల పట్ల కొందరు అనుచితంగా ప్రవర్తించారు. కనీసం జాలి లేకుండా దారుణానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. సంబల్‌పూర్ జిల్లాలోని నేతాజీ నగర్‌లో సమర్థ్ అనే ఓ ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమంలో ఉన్న మానసిక రోగులపై యాజమాన్యం అనుచితంగా ప్రవర్తించింది. మానసిక సమస్యలతో బాధపడుతున్న ఓ వృద్ధురాలిని దారుణంగా కొట్టి చిత్ర హింసలకు గురి చేశారు.

ఇది కూడా చూడండి: America: కాళ్లూ, చేతులు కట్టేసి.. నీళ్లు కూడా ఇవ్వకుండా.. అక్రమవలసదారుపై అమెరికా వికృత చేష్టలు!

ఇది కూడా చూడండి: occult worship : కర్నూలు జిల్లా బి తాండ్రపాడు ఎస్సార్ విద్యాసంస్థల్లో  క్షుద్ర పూజల కలకలం

మానసిక వృద్ధురాలిని హింసిస్తున్న వీడియో వైరల్ కావడంతో..

కర్రతో ఆమెను కొట్టడంతో పాటు కాలితో తన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నెటిజన్లు తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధులపై దాడి చేస్తున్న ఇలాంటి సంస్థలపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితులపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు అన్నారు. 

ఇది కూడా చూడండి: Vitamin D Injection: ఏడాదికి ఒకసారి విటమిన్ డి ఇంజెక్షన్‌తో లాభాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు