/rtv/media/media_files/2025/07/14/kerala-nipah-virus-news-today-2025-07-14-13-25-21.jpg)
kerala nipah virus news today
కేరళలో మరోసారి ప్రాణాంతక నిఫా వైరస్ (Nipah Virus) కలకలం రేపుతోంది. ఇప్పటికి రెండు మరణాలు నిఫా వైరస్ అనుమానంతో సంభవించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా మలప్పురం, పాలక్కాడ్ జిల్లాల్లో పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
Also Read: ఏరా బుద్దుందా.. అభిమానిని తోసేసిన రాజమౌళి.. వీడియో వైరల్!
Nipah Virus Alert
మలప్పురంలో యువతి మృతి: మలప్పురం జిల్లాకు చెందిన 18 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని జూలై 1, 2025న నిఫా వైరస్ బారిన పడి మృతి చెందింది. తీవ్రమైన జ్వరం, వాంతులతో బాధపడుతున్న ఆమెకు మెదడువాపు (ఎన్సెఫలైటిస్) లక్షణాలు కనిపించాయి. ఆమె నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)కి పంపగా.. నిఫా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
Also Read: టెక్సాస్‌లో భారీ వరద బీభత్సం.. 160 మందికి పైగా..!
పాలక్కాడ్‌లో మరో వ్యక్తి మృతి: పాలక్కాడ్ జిల్లాకు చెందిన 57 ఏళ్ల వ్యక్తి జూలై 12, 2025న మృతి చెందాడు. ఆయనకు కూడా నిఫా వైరస్ సోకినట్లు అనుమానం రావడంతో.. మంజేరి మెడికల్ కాలేజీలో పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయన నమూనాలకు నిఫా పాజిటివ్ వచ్చినట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. అయితే దీనిపై పుణేలోని NIV నుంచి తుది నిర్ధారణ రావాల్సి ఉంది. ఈ మరణంతో కేరళలో నిఫా వైరస్ మృతుల సంఖ్య రెండుకు చేరింది.
ఈ పరిణామాల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్.. కోజికోడ్, మలప్పురం, పాలక్కాడ్, కన్నూర్, వయనాడ్, త్రిశూర్ సహా ఆరు జిల్లాల్లో హై అలర్ట్ జారీ చేశారు. మృతి చెందిన, అనుమానిత కేసులతో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించే ప్రక్రియను వేగవంతం చేశారు. 57 ఏళ్ల వ్యక్తికి సంబంధించిన 46 మంది కాంటాక్టులను గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ టవర్ లొకేషన్ డేటాను ఉపయోగించి ఈ జాబితాను రూపొందించారు.