/rtv/media/media_files/2025/07/27/thief-2025-07-27-15-38-20.jpg)
తన భార్య ఖరీదైన డిమాండ్లను తీర్చలేక, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (BBA) గ్రాడ్యుయేట్ అయిన ఓ భర్త దొంగగా మారాడు. దొంగతనాలకు పాల్పడుతూ పెళ్లైన నెల రోజులకే అరెస్ట్ అయ్యాడు.రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం జామ్‌వరమ్‌గఢ్ గ్రామానికి చెందిన తరుణ్ పరీక్‌కు నెల రోజుల కిందట ఒక మహిళతో పెళ్లి జరిగింది. తన భార్య డిమాండ్లను తీర్చడానికి అతను నేర మార్గాన్ని ఎంచుకున్నాడు. అతని భార్య డబ్బు కోసం, లగ్జరీ లైఫ్ కోసం అతనిపై ఒత్తిడి తెస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.
ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాన్ని వదులుకుని
ఆ ఒత్తిడికి లొంగిన తరుణ్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాన్ని వదులుకుని, తన భార్య డిమాండ్లను నెరవేర్చడానికి దొంగగా మారాడు. ఇటీవల జైపూర్‌లోని ట్రాన్స్‌పోర్ట్ నగర్ ప్రాంతంలో పట్టపగలు ఒక వృద్ధ మహిళ నుండి బంగారు గొలుసును కొట్టేశాడు. ఈ సంఘటన స్థానికంగా భయాందోళనలను రేకెత్తించింది. సిసిటివి ఫుటేజ్ ఆధారంగా, పోలీసులు తరుణ్ ను అదుపులోకి తీసుకున్నారు. తరుణ్ ఎన్ని నేరాలు చేశాడో, అతనికి ఎవరైనా సహచరులు ఉన్నారా అని తెలుసుకోవడానికి పోలీసులు ఇప్పుడు అతన్ని ప్రశ్నిస్తున్నారు.
Also read : Hyderabad: గూగుల్ మ్యాప్‌లో చావుని వెతుక్కుంటూ.. మూసీలో కొట్టుకుపోయిన బీటెక్ స్టూడెంట్
Also read : Telangana crime : కొడుకు చేతిలో చిప్స్ పెట్టి లవర్తో జంప్.. దొరికిన ప్రేమ జంట!