Harshvardhan Jain: నీ తెలివికి హ్యాట్సాఫ్.. ఫేక్ ఆఫీస్ పెట్టి రూ.300 కోట్లు దోచేశాడు

నకిలీ రాయబార కార్యాలయం కేసులో నిందితుడు హర్షవర్ధన్ జైన్‌కు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతను దాదాపు రూ. 300 కోట్ల ఫ్రాడ్ చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. గత పదేళ్లలో హర్షవర్ధన్ జైన్ 162 సార్లు విదేశాలకు వెళ్లినట్లు గుర్తించారు.

New Update
Ghaziabad

Harshvardhan Jain

నకిలీ రాయబార కార్యాలయం కేసులో నిందితుడు హర్షవర్ధన్ జైన్‌కు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతను దాదాపు రూ. 300 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. గత పదేళ్లలో హర్షవర్ధన్ జైన్ 162 సార్లు విదేశాలకు వెళ్లినట్లు గుర్తించారు. ఢిల్లీలోని ఘజియాబాద్‌లో ఎనిమిదేళ్ల క్రితమే నకిలీ రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, విదేశాల్లో ఉద్యోగాల పేరుతో అమాయక యువతను మోసం చేసినట్లు పోలీసులు కనుగొన్నారు.

కుంభకోణంలో భాగంగా, ఇతను 25 షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి, హవాలా మార్గంలో డబ్బు అక్రమ బదిలీలకు పాల్పడినట్లు స్పెషల్ టాస్క్ ఫోర్స్ దర్యాప్తులో తేలింది. హర్షవర్ధన్ జైన్‌కు విదేశాల్లో పదుల సంఖ్యలో బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు కూడా సిట్ అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, వివాదాస్పద స్వామీజీ చంద్రస్వామి, సౌదీ ఆయుధ వ్యాపారి అద్నాన్ ఖషోగ్గితో జైన్ దిగిన ఫోటోలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కుంభకోణం వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.

Advertisment
తాజా కథనాలు