/rtv/media/media_files/2025/09/08/ys-sharmila-2025-09-08-14-41-06.jpg)
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి(ys-raja-reddy) రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నట్లు ఏపీ పోలిటికల్ సర్కిల్లో ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. తన తల్లి షర్మిల పర్యటనల్లో ఆయన ఈ మధ్య తరుచుగా పాల్గొంటున్నారు. ఇటీవల, ఆయన తన తల్లితో కలిసి కర్నూలు ఉల్లి మార్కెట్‌ను సందర్శించి రైతుల సమస్యలను రాజారెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఇది ఆయన రాజకీయ అరంగేట్రానికి సూచన అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
వైఎస్సార్ కుటుంబంలో విభేదాలు ఉన్నప్పటికీ, రాజారెడ్డి వైఎస్సార్ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తడాని భావిస్తున్నారు. రాజారెడ్డి మంచి చదువుకున్న యువకుడు. ఆయన హైదరాబాద్‌లోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో విద్యాభ్యాసం చేశారు. ఆ తర్వాత అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆయన డల్లాస్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (BBA) కోర్సు పూర్తి చేశారు.
అలాగే అప్లయిడ్ ఎకనామిక్స్, ప్రెడిక్టివ్ అనలిటిక్స్ సబ్జెక్టులతో మాస్టర్ ఆఫ్ సైన్స్ (MSc) పట్టా కూడా పొందారు. రాజారెడ్డి 2024లో అట్లూరి ప్రియ అనే యువతిని వివాహం చేసుకున్నారు. వీరి వివాహం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఘనంగా జరిగింది. అన్ని కుదిరితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీకి ఆయన పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీ రాజకీయాల్లో వైఎస్ కుటుంబానాకి మంచి ఆదరణ ఉంది.
Also Read : జగన్ కు మరో బిగ్ షాక్.. పాలిటిక్స్ లోకి షర్మిల కుమారుడు రాజారెడ్డి!
కడప జిల్లా కంచుకోట
వైఎస్సార్ నుంచి జగన్, వైఎస్ వివేకా, విజయమ్మ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి సత్తా చాటారు. ముఖ్యంగా కడప జిల్లా ఆ కుటుంబానికి కంచుకోటగా చెబుతారు. మరి రాజారెడ్ది ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది చూడాలి. .ఇప్పటికే టీడీపీ, జనసేన పార్టీలతో గట్టి పోటీ ఎదురుకుంటున్న జగన్ కు అల్లుడి రూపంలో మరో ప్రత్యర్థి ఎదురైతే మాత్రం వైసీపీ మరిన్ని కష్టాలు తప్పవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read : ప్రాణాలు తీస్తున్న పిడుగులు..