BREAKING: చంద్రబాబు సంచలన నిర్ణయం.. టీటీడీ ఈవోపై బదిలీ వేటు.. కారణమిదేనా?

ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీలు అయ్యారు. ప్రస్తుత ఈవో శ్యామల రావు ఉండగా ఇతని స్థానంలో అనిల్ కుమార్‌ సింఘాల్‌ను టీటీడీ ఈవోగా చంద్రబాబు నియమించారు. శ్యామల రావును కావాలనే ఇప్పుడు బదిలీ చేసినట్లు తెలుస్తోంది.

New Update
BREAKING NEWS

BREAKING NEWS

ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీలు అయ్యారు. ప్రస్తుత ఈవో శ్యామల రావు ఉండగా ఇతని స్థానంలో అనిల్ కుమార్‌ సింఘాల్‌ను టీటీడీ ఈవోగా చంద్రబాబు నియమించారు. గతంలోనూ సింఘాల్ టీటీడీ ఈవోగా బాధ్యతలు నిర్వహించారు. అయితే శ్యామల రావును కావాలనే ఇప్పుడు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో టోకెన్ల విషయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు స్పాట్‌లోనే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. ఈ సమయంలో శ్యామల రావుపై నెగిటివిటీ పెరిగింది. దీనిపై చంద్రబాబు ఓ సమావేశం కూడా నిర్వహించి అందరి ముందే వీరిపై ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే అతన్ని కావాలనే బదిలీ చేసినట్లు తెలుస్తోంది. అయితే శ్యామల రావును జీఎడీ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: జగన్ కు మరో బిగ్ షాక్.. పాలిటిక్స్ లోకి షర్మిల కుమారుడు రాజారెడ్డి!

గవర్నర్ ప్రత్యేక కార్యదర్శిగా..

రోడ్లు భవనాలు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కృష్ణబాబు, రెవెన్యూ, కెక్సైజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ముఖేశ్‌కుమార్‌ మీనా, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సీహెచ్‌ శ్రీధర్‌, అటవీ, పర్యావరణశాఖ కార్యదర్శిగా కాంతిలాల్‌ దండేను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనంతరామ్‌, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శిగా సౌరభ్‌ గౌర్‌, ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా ప్రవీణ్‌ కుమార్‌, పరిశ్రమలు, కార్మికశాఖ కమిషనర్‌గా శేషగిరిబాబు, రెవెన్యూ (ఎండోమెంట్‌) కార్యదర్శిగా హరి జవహర్‌లాల్‌ నియమితులయ్యారు.

ఇది కూడా చూడండి: YS Raja Reddy : మామకు పోటీగా అల్లుడు.. రాజారెడ్డి బ్యాక్ గ్రౌండ్ ఇదే!

Advertisment
తాజా కథనాలు