Nalgonda Crime: నల్గొండ జిల్లా బొకంతలపాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రియుడు మోసం చేశాడని ఓ యువతి బలవన్మరణం చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లో స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తున్న మల్లేశ్వరి అనే యువతి జాన్ రెడ్డి అనే వ్యక్తిని ప్రేమించింది. తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. జాన్ రెడ్డి 15 రోజుల కిందట మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో మల్లేశ్వరి మనస్థాపం చెంది హాస్టల్‌లోనే మత్తు ఇంజక్షన్ తీసుకుని మృతి చెందింది. దీంతో యువతి డెడ్‌బాడీని తీసుకుని కుటుంబ సభ్యులు జాన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేశారు. జాన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: Shiva Puja: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!
సంగారెడ్డి జిల్లాలో కూడా..
ఇదిలా ఉండగా.. సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ఓ భర్త భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. పఠాన్ చెరువు మండలంలో పెద్దకంజర్ల గ్రామం రమిలా అనే మహిళకు సురేష్ (32)తో ఐదు సంవత్సరాల క్రితం ఘనంగా వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కూతురు కూడా ఉంది. పెళ్లి అయినప్పటి నుంచి ఈ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.
ఇది కూడా చూడండి: HIT 3 Trailer: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..
కానీ గత కొన్ని రోజుల నుంచి ఇద్దరి మధ్య గొడవలు పెరిగాయి. చివరకు పంచాయతీ వరకు కూడా వెళ్లారు. ఈ క్రమంలో రమిలా తన తల్లి ఇంటి దగ్గర ఉంటుంది. అయితే ఈ సమయంలో కూడా సురేశ్ అక్కడికి వెళ్లి గొడవ పడేవాడు. ఓ రోజు తీవ్ర ఆగ్రహానికి గురై రోకలి బండతో రమిలాపై దాడి చేశాడు. అడ్డు వచ్చిన అత్తను కూడా రోకలితో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. కుటుంబ సభ్యుల అనుమతితో సురేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
ఇది కూడా చూడండి:Aghori Audio Call Leak: రాధీ నావల్ల కావట్లేదే.. ఫస్ట్ వైఫ్‌తో అఘోరీ రాసలీలల ఆడియో లీక్.. ఒక్కసారి విన్నారంటే?