/rtv/media/media_files/2025/07/28/mysaa-pooja-ceremony-pic-one-2025-07-28-10-42-10.png)
హైదరాబాద్ లో జరిగిన ఈ పూజ కార్యక్రమానికి నిర్మాత సురేష్ బాబు, డైరెక్టర్ హను రాఘవపూడి, రవికిరణ్ కోలా తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
/rtv/media/media_files/2025/07/28/mysaa-pooja-ceremony-pic-five-2025-07-28-10-42-10.png)
ప్రారంభ సన్నివేశానికి సురేష్ బాబు మొదటి క్లాప్ కొట్టగా, దర్శకుడు రవికిరణ్ కోలా కెమెరా స్విచ్చాన్ చేశారు. హను రాఘవపూడి బౌండ్ స్క్రిప్ట్‌ను చిత్ర బృందానికి అందజేయడంతో పాటు మొదటి షాట్‌కు దర్శకత్వం వహించారు.
/rtv/media/media_files/2025/07/28/mysaa-pooja-ceremony-pic-three-2025-07-28-10-42-10.png)
హీరోయిన్ సెంట్రిక్ కథగా రూపొందనున్న ఈ సినిమాలో రష్మిక ఒక గోండ్ మహిళ పాత్రలో కనిపించనుంది. మునుపెన్నడూ పోషించని పాత్రకు భిన్నంగా ఇందులో కనిపించబోతుంది రష్మిక.
/rtv/media/media_files/2025/07/28/mysaa-pooja-ceremony-pic-four-2025-07-28-10-42-10.png)
'అర్ధ శతాబ్దం' ఫేమ్ రవీంద్ర పూలే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. 'అన్‌ఫార్ములా ఫిల్మ్స్' బ్యానర్‌పై అజయ్, అనిల్ సాయపరెడ్డిల నిర్మిస్తున్నారు.
/rtv/media/media_files/2025/07/28/mysaa-pooja-ceremony-pic-two-2025-07-28-10-42-10.png)
ఇటీవలే 'కుబేరా', రీసెంట్ గా 'యానిమల్', 'పుష్ప 2' ఛావా వంటి విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న రష్మిక .. ఇప్పుడు 'మైసా'తో తనలోని మరో కొత్త కోణాన్ని పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది.
/rtv/media/media_files/2025/07/28/mysaa-pooja-ceremony-pic-six-2025-07-28-10-42-10.png)
పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రం ఐదు భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్ లో రష్మిక శక్తివంతమైన లుక్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది.
/rtv/media/media_files/2025/07/28/mysaa-pooja-ceremony-pic-four-2025-07-28-10-42-10.png)
ఈ సినిమాలో రష్మిక తన పాత్రకు న్యాయం చేయడానికి యాక్షన్ సన్నివేశాల్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది. అలాగే యోధురాలిగా తన పాత్ర కోసం కత్తిసాము కూడా నేర్చుకుంటున్నట్లు సమాచారం.