Naga Panchami 2025: నాగ పంచమి నాడు ఈ వస్తువులను అస్సలు వాడకండి

నాగ పంచమి 2025 జూలై 29 మంగళవారం నాడు రాబోతుంది. నాగ పంచమి అనేది సర్ప దేవతలకు అంకితమైన రోజు కనుక రాహువుతో సంబంధం ఉన్న ఇనుమును ఈ రోజున వాడకపోవడం ద్వారా ఆ గ్రహ ప్రభావాన్ని తగ్గించవచ్చని పండితులు చెబుతున్నారు.

New Update
Naga Panchami 2025

Naga Panchami 2025

Naga Panchami 2025: హిందూ మతంలో పలు విశిష్ట పండుగలలో నాగ పంచమి ఒకటి. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో శుక్ల పక్ష ఐదవ తేదీన జరుపుకుంటారు. 2025లో ఈ పండుగ జూలై 29 మంగళవారం నాడు రాబోతుంది. ఈ రోజున సర్ప దేవతను భక్తిశ్రద్ధలతో పూజించటం, శివుడికి అభిషేకం చేయడం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. నాగ పంచమి కేవలం ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంగా కాకుండా.. సంప్రదాయాలను గౌరవించే రోజు కూడా. దీని వెనుక నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర విశ్వాసాలు అతి ప్రాచీనమైనవి. నాగ పంచమి నాడు ఇనుప వస్తువులను ఎందుకు ఉపయోగించకూడదు వాటిపై కొన్ని విషయాలు ఈఆర్టికల్‌లో తెలుసుకుందాం.

ఇనుము వస్తువులు నిషేధం..

ఈ పవిత్ర రోజున ఇనుముతో తయారు చేసిన వస్తువులను ఉపయోగించకూడదనే నమ్మకం చాలా ఏళ్లుగా ప్రజలలో ఉంది. కత్తులు, కత్తెరలు, ఇనుప పాత్రలు, వంట పరికరాలు వంటి వాటిని కూడా వాడకూడదనే నిబంధనను అనేక మంది పాటిస్తున్నారు. ఇది మామూలు నమ్మకంగా కాకుండా.. దీనికి మతపరమైన, గ్రహశాస్త్ర సంబంధిత కారణాలు ఉన్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం.. ఇనుము రాహు గ్రహానికి సంబంధించిన వస్తువు. రాహువు పాము యొక్క రూపంగా భావించబడుతుంది. నాగ పంచమి అనేది సర్ప దేవతలకు అంకితమైన రోజు కనుక రాహువుతో సంబంధం ఉన్న ఇనుమును ఈ రోజున వాడకపోవడం ద్వారా ఆ గ్రహ ప్రభావాన్ని తగ్గించవచ్చని నమ్మకం ఉంది. రాహుతోపాటు శని గ్రహం కూడా ఇనుముతో సంబంధం కలిగి ఉంటుంది.

ఇది కూడా చదవండి: ఆ ఎసిడిటీ టాబ్లెట్లతో క్యాన్సర్ ముప్పు.. కేంద్రం షాకింగ్ ప్రకటన!

 ఈ రెండు గ్రహాల కలయిక జీవితంలో అనేక ఆటుపోటులను తెచ్చిపెడతాయని జ్యోతిష్యలు అంటున్నారు. శనిగ్రహం ప్రతాపంతో రాహు దోషం తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అందుకే నాగ పంచమి రోజున శాంతిని, స్వచ్ఛతను కాపాడుకునేందుకు ఇనుము వాడకాన్ని నివారించడం సంప్రదాయంగా మారిపోయింది. ఇలాగే పాన్ మీద వంట చేయకూడదనే నిబంధన కూడా ఇదే నమ్మకంతో ముడిపడి ఉంది. ఎందుకంటే పాన్ కూడా ఇనుముతో తయారవుతుంది. చాలా మంది ఈ రోజున రొట్టెలు వండడం కూడా మానేస్తారు. నాగ పంచమి అనేది గ్రహశాంతి, దేవతా అనుగ్రహం పొందే దినంగా భావించబడుతుంది. అందుకే ఈ రోజున ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా నిర్వర్తిస్తూ, శుభకార్యాలు చేపట్టడం, దుర్గుణాల నుంచి తప్పించుకోవడం వంటి లక్ష్యాలతో పాటుపడతారు. సంప్రదాయాలను గౌరవిస్తూ.. నమ్మకాలపై విశ్వాసం ఉంచుతూ నాగ పంచమిని శుభదినంగా జరుపుకోవడం అనేది తరతరాలుగా కొనసాగుతున్న ఆచారమే.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.  

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ తమ్ముడి టార్చర్.. యువకుడు ఆత్మ*హత్య!

( Latest News)

Advertisment
తాజా కథనాలు