Woman Kill Husband: భర్తని లేపేయడానికి భార్య ప్లాన్.. లవర్‌తో పాము కొనిపించి రాత్రికిరాత్రే

వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్య ప్రియుడితో కలిసి భర్తను లేపేయాలని ప్లాన్ వేసింది. మీరట్‌ వాసి రనిత లవర్‌ అమర్‌దీప్‌తో పాము కొనిపించి, భర్త గొంతు పిసికి చంపి పాముకాటుతో అమిత్ చనిపోయినట్లు చిత్రీకరించింది. పోస్టుమార్టం రిపోర్ట్‌లో అసలు నిజం బయటపడింది.

New Update
Meerut woman kills husband

Meerut woman kills husband

ప్రియుడితో కలిసి మొగుడిని లేపేసింది ఓ కామ పిచాచి. దాన్ని యాక్సిడెంటల్ డెత్‌గా చెప్పగానికి పాముతో కాటు వేయించారు. కొన్ని నెలల క్రితం మీరట్‌లో జరిగిన సౌరభ్ హత్య మదిరిగానే మరో హత్య చోటుచేసుకుంది. మీరట్ నుండి మరో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. మీరట్ జిల్లా బహసుమా ప్రాంతంలోని అక్బర్‌పూర్ సదత్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. పోలీసుల ప్రకారం.. ముగ్గురు పిల్లల తల్లైన రవిత, స్థానికంగా టైల్స్ కార్మికుడు అమర్‌దీప్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అతను తరచుగా వారి ఇంటికి వచ్చేవాడు. విషయం భర్తకు తెలియడంతో అమిత్‌కు అనుమానం, కోపం రెండూ పెరిగాయి. దీంతో వారి మధ్య తరుచూ వివాదాలు అవుతుండేవి. రనిత తన దాంపత్య జీవితానికి గుడ్‌బై చెప్పి.. వివాహేత సంబంధానికి వెల్‌కమ్ చెప్పాలని ప్లాన్ వేసింది. లవర్‌తో కలిసి భర్తను హత్య చేయడానికి ప్లాన్ వేసింది.  

Also read: Robert Vadra: నా పుట్టినరోజు ఈడీ ఆఫీసులో జరుపుకుంటాను

హత్య జరిగిన రోజు రనిత భర్తతో కలిసి గుడికి వెళ్లింది. తిరిగి వచ్చిన తర్వాత, ఆమె అమర్‌దీప్‌కు ఫోన్ చేసి ఒక పామును కొనమని చెప్పింది. ఆ రోజు రాత్రి వారి ప్లాన్ అమలు చేద్దమని అనుకున్నారు. అమర్‌దీప్ పాముతో వచ్చాడు. ఆ రాత్రి ఇద్దరూ అమిత్‌ను గొంతు నులిపి చంపారని పోలీసులు తెలిపారు. తర్వాత అతని కింద పామును వదిలారు. పాము కరిచి భర్త చనిపోయాడని అందరిని నమ్మించింది రనిత. 

Also read: BIG BREAKING: మోదీ సర్కార్‌కు సుప్రీంకోర్టు బిగ్ షాక్.. వక్ఫ్ చట్టంపై కీలక ఆదేశాలు

పోస్టుమార్టం చేయడంతో బయటపడ్డ బాగోతం..

అయితే అనుమానం వచ్చిన పోలీసులు డెడ్‌బాడీకి పోస్టుమార్టం చేయించారు. దీంతో అసలు విషయం బయటపడింది. రనితని పోలీసులు గట్టిగా అడగ్గా అసలు నిజం కక్కేసింది. ఆమె ప్రియుడు అమర్‌దీప్ తోపాటు ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసుతోపాటు జంతువులను విక్రయించినందుకు పలు సెక్షన్ల నమోదు చేశారు.

 

(telugu crime news | Woman kills husband | Meerut Husband Case)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు