/rtv/media/media_files/2024/11/05/id8litA7yPAhjlG9maZX.jpg)
కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. వక్ఫ్ చట్టంపై గురువారం ఉన్నత న్యాయస్థానం స్టేటస్ కో విధించింది. ఆ చట్టంపై యథాతథ స్థితి కొనసాగించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పులు చేయోద్దని వక్ఫ్ బోర్డులో కొత్త నియామకాలు చేపట్టొద్దని మోదీ సర్కార్‌ను ఆదేశించింది. వక్ఫ్ చట్టంపై దాఖలైన 73 పిటిషన్లను గురువారం రెండవ రోజు సుప్రీం కోర్టు థర్మాసనం విచారించింది.
Bad news 😞
— narne kumar06 (@narne_kumar06) April 17, 2025
Waqf bill
Supreme Court orders status quo for a week. 'WAQF BY USER' gets one week extension.
Centre makes the following statements to the Supreme Court:
Non-Muslims won't be appointed to Central Waqf Councils and State Waqf Boards. pic.twitter.com/VpOhoMcyhv
కౌంటర్ దాఖలు చేయడానికి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి వారం రోజులు గడువు ఇచ్చింది. సర్వోన్నత న్యాయస్థానం అగిడిన ప్రశ్నలతో పూర్తి అఫిడవిడ్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో విచారణ జరిగింది. వక్ఫ్ చట్టంలో ఎలాంటి మార్పలు చేయోద్దని సుప్రీం కోర్టు విచారణ ముగించింది.