Robert Vadra: నా పుట్టినరోజు ఈడీ ఆఫీసులో జరుపుకుంటాను

రాబర్ట్ వాద్రా మూడో రోజు ఈడీ విచారణకు హాజరైయ్యాడు. రేపు కూడా విచారణకు హాజరు కావాలంటే తన పుట్టిన రోజు ఈడీ ఆఫీసులోనే జరుపుకుంటానని ఆయన మీడియాతో అన్నారు. గతంలో అడిగిన ప్రశ్నలే ఇప్పుడు ఈడీ అధికారులు అడిగారని, ఇవి BJP రాజకీయ కక్ష సాధింపు చర్యలని ఆయన అన్నారు.

New Update
Robert Vadra

Robert Vadra

వయనాడ్‌ ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాను గురువారం మూడోరోజు ఈడీ అధికారులు విచారించారు. హరియాణాలోని భూ ఒప్పందానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. విచారణ అనంతరం ఆయన మీడియాలో మాట్లాడారు. రేపు సెలవు రోజు కాకుంటే నా పుట్టినరోజు ఈడీ ఆఫీసులో జరుపుకుంటానని ఆయన అన్నారు. ఈడీ కొత్త ప్రశ్నలేవీ అడగటం లేదంటూ అసహనం వ్యక్తంచేశారు. 

Also read: Robert Vadra: నా పుట్టినరోజు ఈడీ ఆఫీసులో జరుపుకుంటాను

2019లోనూ దర్యాప్తు సంస్థ అధికారులు ఇవే ప్రశ్నలు అడిగారు. ఈ ప్రభుత్వం మమ్మల్ని తప్పుగా చూపించేందుకునే ఇలా చేస్తోందని వాద్రా అన్నారు. బీజేపీ కుట్రలను తట్టుకునే శక్తి తనకుందని వాద్రా చెప్పారు. ఈడీ చర్య తనపై, తన కుటుంబంపై జరుగుతున్న రాజకీయ కక్ష సాధింపు అని పేర్కొన్నారు. ఈ రోజు విచారణకు వాద్రా వెంట ఆయన భార్య ప్రియాంక వచ్చారు. 

Also read: BIG BREAKING: మోదీ సర్కార్‌కు సుప్రీంకోర్టు బిగ్ షాక్.. వక్ఫ్ చట్టంపై కీలక ఆదేశాలు

వాద్రా కంపెనీ 2008 ఫిబ్రవరిలో గుర్గావ్‌లోని షికోపూర్‌లో 3.5 ఎకరాల స్థలాన్ని ఓంకారేశ్వర్‌ ప్రాపర్టీ నుంచి కొనుగోలు చేసింది. దీని విలువ రూ.7.5 కోట్లు. ఆ తర్వాత వాద్రా కంపెనీ ఆ భూమిని రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ అయిన డీఎల్‌ఎఫ్‌కు రూ.58 కోట్లకు విక్రయించింది. డీఎల్‌ఎఫ్‌కు రూ.58 కోట్ల భారీ లాభంతో విక్రయించడంతో మనీలాండరింగ్ ఆరోపణలు వచ్చాయి. ఈనేపథ్యంలో ఈడీ విచారణ జరుపుతోంది. ఈ కేసులో మంగళవారం వాద్రాకు ఈడీ మంగళవారం నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. గత రెండు రోజుల్లో పది గంటల పాటు ఆయన వాంగ్మూలాన్ని అధికారులు రికార్డు చేశారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు