/rtv/media/media_files/2025/06/23/student-dies-after-brutal-beating-by-father-over-low-neet-scores-2025-06-23-12-57-07.jpg)
Student Dies After Brutal Beating by Father Over Low NEET Scores
మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) లో మంచి మార్కులు సాధించలేదనే కారణంతో 17 ఏళ్ల బాలికను ప్రధానోపాధ్యాయుడు కొట్టి కొట్టి చంపిన ఘటన సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..నెలకు రూ.2,016 పెన్షన్
మార్కులు తక్కువగా వచ్చాయని
సాంగ్లి జిల్లా నెల్కరంజి గ్రామానికి చెందిన 17 ఏళ్ల సాధన భోసలే అనే బాలిక అట్పాడిలోని ఒక కాలేజీలో 12వ తరగతి చదువుతుంది. ఆమె తండ్రి పేరు ధోండిరామ్ భోసలే. ఆయన కాలేజీ ప్రిన్సిపల్. నీట్ మాక్ పరీక్షలో తన కూతురు సాధనకు తక్కువ మార్కులు వచ్చాయని ఆమెపై ఆగ్రహానికి గురయ్యాడు.
Also Read : ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్లి
దీంతో ఆమెను ప్రశ్నించాడు. ఎందుకు తక్కువ మార్కులు వచ్చాయి అని అడిగాడు. దానికి ఆమె సమాధానం అతడికి మరింత కోపం తెప్పించింది. ‘‘నాన్న, మీరు ఏ కలెక్టర్ అయ్యారు? మీకు కూడా తక్కువ మార్కులు వచ్చాయి కదా” అని సమాధానం ఇచ్చింది. ఆమె మాటలతో చిర్రెత్తిపోయిన తండ్రి చెక్క కర్రతో చితకబాదాడు.
Also Read: షాకింగ్ న్యూస్.. విమాన ప్రమాదంలో ప్రముఖ దర్శకుడి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..!
రాత్రంతా తన కూతురిని కనికరం లేకుండా కొడుతూనే ఉన్నట్లు సమాచారం. ఆమె తీవ్రంగా గాయపడినా కొట్టడం ఆపలేదు.. ఆసుపత్రికి తీసుకెళ్లలేదు. ఆ మరుసటి రోజు ఉదయం యోగా దినోత్సవ కార్యక్రమానికి హాజరు అయ్యాడు. ఆ కార్యక్రమం అయిపోగానే అతడు తిరిగి ఇంటికి వచ్చేసరికి సాధన అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమెమృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అరంతరం రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడైన తండ్రిని అరెస్టు చేశారు. . .