ప్రేమ, అక్రమ సంబంధాలు, వరకట్నం వేధింపులు వంటి వాటి వల్ల ప్రస్తుతం చాలా మంది అమ్మాయిలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి ఓ ఘటన తాజాగా ఖమ్మంలో చోటుచేసుకుంది. ఎస్సై అయిన భర్త, అత్త మామల వేధింపులు భరించలేక ఆ భార్య ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లాలో ఆర్పీఎఫ్ ఎస్సైగా రాణాప్రతాప్ ఉంటున్నాడు.
ఇది కూడా చూడండి: Anchor Swetcha : యాంకర్ స్వేచ్ఛ కేసులో బిగ్‌ట్విస్ట్...ఆమె మరణానికి పూర్ణనే కారణం..?
వేధింపులు భరించలేక..
ఇతనికి రాజేశ్వరితో 8 ఏళ్ల కిందట వివాహం జరిగింది. అయితే కొంత కాలం నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో గొడవలు ఎక్కువగా కావడంతో రాజేశ్వరి తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. ఇటీవల మరోసారి గొడవ జరిగింది. భర్త, అత్తమామల వేధింపులు భరించలేక మనస్తాపం చెందిన రాజేశ్వరి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కొన ఊపిరితో ఉన్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స తీసుకుంటూ రాజేశ్వరి మృతి చెందింది. రాణాప్రతాప్ ట్రైనీ ఎస్సైగా ఉన్నప్పుడే వ్యాపారులను బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇది కూడా చూడండి: TG Crime: ప్రైవేట్ హాస్పిటల్ నిర్లక్ష్యంతో పసికందు మృతి...తీవ్ర ఉద్రిక్తత
ఇదిలా ఉండగా ఇటీవల తమిళనాడులో కూడా ఇలాంటి దారుణ ఘటన జరిగింది. వివాహం చేసుకున్న మూడు నెలలకే నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. తమిళనాడులోని తిరుప్పూర్‌లో ఉంటున్న రితన్య (27)కు, కవిన్ కుమార్ (28)తో ఇటీవల పెళ్లి జరిగింది. పెళ్లిలో అధికంగానే కట్నం ఇచ్చారు. కానీ అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధించడంతో పురుగుమందు తాగి రితన్య ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి అయి కనీసం మూడు నెలలు కూడా కాకుండానే రితన్య చనిపోవడంతో తల్లిదండ్రులు రోధిస్తున్నారు.
ఇది కూడా చూడండి: DK Shiva Kumar: మరో 2 నెలల్లో కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ?
A 27 year old woman died by suicide after 78 days of being married reportedly over dowry torture by in-laws in Thirupur. pic.twitter.com/wmlydDTdJr
— Pramod Madhav (@PramodMadhav6) June 30, 2025