/rtv/media/media_files/2025/09/12/tiger-2025-09-12-16-34-17.jpg)
దేశంలో భార్యభర్తలు ఒకరిని ఒకరు చంపుకోవడం రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. చాలా వరకు వివాహేతర సంబంధాలే కారణం అవుతున్నాయి. తాజాగా ఓ భార్య తన భర్తను పరిహారం కోసం చంపేసింది. వినడానికి నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ ఇది నిజమే. ఈ ఘటన కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని చిక్కహెజ్జూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
Also Read : Cyber Fraud: సైబర్ నేరగాళ్ల వలలో జనసేన ఎంపీ.. ఏకంగా రూ.92 లక్షలు ఎలా కొట్టేశారంటే?
నిందితురాలిని సల్లపురిగా గుర్తించగా మరణించిన భర్త 45 ఏళ్ల వెంకటస్వామిగా గుర్తించారు. వెంకటస్వామికి విషం ఇచ్చి చంపిన సల్లపురి.. ఆ తరువాత తన భర్తను పులి చంపిందని అందర్నీ నమ్మించే ప్రయత్నం చేసింది. ఈ ఘటనపై హున్సూర్ గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా గత సోమవారం గ్రామంలో ఒక పులి కనిపించిందని, తన భర్త ఇంటి నుంచి వెళ్లిపోయి కనిపించడం లేదని, ఆ పులి అతన్ని చంపి లాక్కెళ్లిందని సల్లపురి పోలీసులకు తన ఫిర్యాదులో వెల్లడించింది. పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది క్షుణ్ణంగా ఈ కేసును దర్యాప్తు చేశారు, విచారణలో వాళ్లకు ఎటువంటి జంతువు ఆనవాళ్లు కనిపించలేదు.
Also Read : Nepal: నేపాల్‌లో ఉద్రిక్తతలు.. ఏపీకి చెందిన యాత్రికుల బస్సుపై దాడులు
దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా సల్లపురి అసలు నిజం ఒప్పుకుంది. ఆమె చెప్పిన విషయాలు తెలుసుకున్న పోలీసులు షాకయ్యారు. తన భర్త అడవి జంతువుల దాడి వల్ల చనిపోయాడని నమ్మిస్తే 15 లక్షల రూపాయలు పరిహారంగా అందుతుందని ఆశతో ఇలా చేశానంటూ నిందితురాలు సల్లపురి ఒప్పకుంది. అనంతరం పోలీసులు వెంకటస్వామి మృతదేహాన్ని ఇంటి వెనుక ఉన్న గుంటలో నుంచి బయటకు తీశారు.
హెజ్జూర్ గ్రామంలో పులి సంచరిస్తున్నట్లు వచ్చిన పుకార్లను ఆసరాగా చేసుకుని నిందితురాలు సల్లపురి తన భర్తను చంపడానికి ఈ విధంగా కుట్ర పన్నిందని పోలీసులు తెలిపారు. నిందితురాలు పొలంలో పనిచేస్తున్నప్పుడు, అడవి జంతువుల దాడుల్లో చనిపోయిన బాధితులకు ప్రభుత్వం రూ. 15 లక్షల పరిహారం అందిస్తుందని చెప్పేది విని ఈ హత్యకు ప్లాన్ చేసిందన్నారు.
Also Read :MIRAI VFX: కార్తిక్ ఘట్టమనేని టెక్నికల్ బ్రిలియన్స్ అరాచకం ..ఈ విజువల్స్ చూస్తే గూస్ బంప్స్ అంతే!