స్పెయిన్‌లో వరద విలయ తాండవం.. కుప్పకుప్పలుగా మృతదేహాలు!

స్పెయిన్‌లో అకస్మాత్తుగా వచ్చిన భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 158 మంది మరణించారు. కార్లు, శిథిలాల కింద కుప్పకుప్పలుగా మృతదేహాలు కనిపిస్తున్నాయి. ఈ వరదల్లో ఇప్పటి వరకు చాలా మంది గల్లంతైనట్లు కూడా తెలుస్తోంది.

New Update
స్పెయిన్‌ను ముంచెత్తిన వరదలు, భయాందోళనలో ప్రజలు

స్పెయిన్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఆకస్మికంగా వచ్చిన ఈ వరదలు ప్రజలను అల్లకల్లోలం చేశాయి. అక్మస్మాత్తుగా వచ్చిన ఈ వరదల కారణంగా ఇప్పటి వరకు 158 మరణించారు. ఈ వరదల్లో ఇప్పటి వరకు చాలా మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. అత్యవసర బృందాలు వెంటనే సహాయక చర్యలు చేపట్టి అనేక మందిని రక్షించాయి.

ఇది కూడా చదవండి: జగన్ కు బిగ్ షాక్.. మీటింగ్ మధ్యలోనే అలిగి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే

అకస్మాత్తుగా వచ్చిన వరదలకు..

వరదల కారణంగా అన్ని పాడైపోయిన కార్లు, శిథిలాల కింద మృతదేహాలు కుప్పకుప్పలుగా ఉన్నాయి. సహాయక బృందాలు వీటిన్నింటిని తీసే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా ఎన్నో గ్రామాలు జల దిగ్భంధంలో ఉండిపోయాయి. చాలా ఇళ్లు, భవనాలు నేలమట్టం అయ్యాయి. ఎన్నో వందలాది కార్లు కూడా కొట్టుకునిపోయాయి. స్పెయిన్‌లోని వాలెన్సియాలో అయితే వరదలు విలయ తాండవం సృష్టించాయి. వీటివల్ల వృక్షాలు, విద్యుత్‌ లైన్లు, ఇంటిలోని సామాన్లు కొట్టుకుని పోయాయి.

ఇది కూడా చదవండి: TG Train: తెలంగాణ రైలు ప్రయాణికులకు శుభవార్త.. మరో రెండు కొత్త లైన్లు!

ఎక్కడ చూసిన నీరు, బురద, మృతేదేహాలే కనిపిస్తున్నాయి. రహదారులు అయితే పూర్తిగా మారిపోయాయి. లెక్కలెనంత మంది గల్లంతయ్యారు. ఇప్పటిక వరకు గల్లంతయిన వారి గురించి ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదు. కొన్న వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి. ఇందులో మృతదేహాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొందరు వరదల కారణంగా కార్లపైనే చిక్కుకున్నారు. 

ఇది కూడా చదవండి: ప్రెసిడెంట్ అయ్యేనాటికి యుద్ధం ముగియాలి–ఇజ్రాయెల్‌కు చెప్పిన ట్రంప్

ఇదిలాఉండగా ఈ మధ్యకాలంలో అనేక దేశాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారత్, చైనా, అమెరికా, జపాన్ దేశాల్లో వరదలు తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు స్పెయిన్‌లో కూడా వరదలు అక్కడి ప్రజల జీవన విధానాన్ని అతలాకుతలం చేసింది. మరోవైపు ప్రపంచంలో జరుగుతున్న వాతావరణ మార్పుల వల్లే భారీ వర్షాలు, వరదలు సంభవిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.  

ఇది కూడా చదవండి: అమెరికా ఎన్నికలకు ముందే అణుబాంబు దాడి.. ఇరాన్‌ బిగ్ ప్లాన్!

 

Advertisment
Advertisment
తాజా కథనాలు