కరివేపాకును ఉదయం పూట నమిలితే ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలు ఉంటాయి. ఇందులోని పోషకాలు అనారోగ్య సమస్యల బారిన పడకుండా చేస్తుంది. కేవలం 15 రోజుల పాటు ఉదయం పరగడుపున కరివేపాకును నమిలితే దీర్ఘకాలిక సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చూడండి: Pakistan: పాకిస్తాన్ సైన్యంపై తాబన్ల దాడి..16 మంది మృతి చెడు కొలెస్ట్రాల్.. కూరల్లో ఎక్కువగా వాడే కరివేపాకు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యపాత్ర వహిస్తాయి. ఖాళీ కడుపుతో ఉదయం పూట ఈ ఆకులను నమిలితే బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతాయి. అలాగే జీర్ణ సమస్యలు, మలబద్ధకం వంటి సమస్యలు క్లియర్ అవుతాయని నిపుణలు అంటున్నారు. ఇది కూడా చూడండి: TS: పోలీసులు పర్మిషన్ ఇచ్చారో లేదో ఆయనకూ తెలుసు–మంత్రి శ్రీధర్ బాబు ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు మొటిమలు, మచ్చలు లేకుండా ఉంచుతుంది. విటమిన్లు, మినరల్స్ రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు అనేక వ్యాధులు రాకుండా సాయపడతాయి. అలాగే ఈజీగా బరువు తగ్గుడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇవి డయాబెటిస్ ఉన్నవారి ఆరోగ్యానికి మంచిది. ఇది కూడా చూడండి: పీఎఫ్ నిధుల మోసం కేసులో మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్పపై అరెస్ట్ వారెంట్ గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చూడండి: ఖాళీ కడుపుతో ఈ ఆకును తింటే.. సమస్యలన్నీ క్లియర్