AP Crime: కడపలో దారుణం.. అరటి పండు ఆశ చూపి మూడేళ్ల బాలికపై..!

అరటి పండు ఆశ చూపి మూడేళ్ల బాలికపై హత్యాచారం చేసిన ఘటన కడపలో చోటుచేసుకుంది. మైలవరంలో బంధువుల పెళ్లికి మూడేళ్ల పాపతో కుటుంబ సభ్యులు వెళ్లారు. అక్కడ ఓ వ్యక్తి అరటి పండు ఆశ చూపి పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆపై చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

New Update
Kadapa crime

Kadapa crime

కడప జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మూడేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేసి చంపేశాడు. వివరాల్లోకి వెళ్తే.. కడప జిల్లా ప్రొద్దుటూరుకి చెందిన దంపతులకు మూడేళ్ల కుమార్తె ఉంది. బంధువుల పెళ్లి ఉండటంతో కుమార్తెను తీసుకుని మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామం వెళ్లారు. అక్కడ ఓ వ్యక్తి అరటి పండు ఇస్తానని ఆశ చూపించి ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు తెలిస్తే ప్రమాదమని బాలికను చంపేశాడు. బాలిక కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Student Suicide News: అమ్మా నేను చిప్స్ దొంగతనం చేయలేదు.. గుండెలు పిండేసిన 7వ తరగతి విద్యార్థి సూసైడ్ లెటర్!

ఇన్‌స్టాగ్రామ్ పరిచయం..

ఇదిలా ఉండగా ఇటీవల ఓ యువతిని నమ్మించి మోసం చేసిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. ఫిలింనగర్‌లో ఉంటూ ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది యువతి. 2023లో అదే సంస్థలో పసుపులేటి అచ్యుత్‌ అనే యువకుడు ఉద్యోగంలో చేరాడు.ఇన్‌స్ట్రాగ్రామ్‌ ద్వారా యువతితో పరిచయం పెంచుకున్నాడు. అలా ఇద్దరూ స్నేహితులయ్యారు. ఆ తర్వాత ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో నమ్మింది. అలా ఇద్దరూ కలసి సహజీవనం చేయడం ప్రారంభించారు. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: రేవంత్‌ రెడ్డికి బిగ్‌షాక్‌.. నేషనల్ హెరాల్డ్‌ కేసులో ఈడీ ఛార్జిషీట్‌

అలా తొలిసారి 2023 సెప్టెంబర్‌ లో యువతి గర్భం దాల్చింది. ఇదే విషయాన్ని అచ్యుత్‌కు చెప్పడంతో అబార్షన్‌ కావడానికి మందులు తెచ్చి ఇచ్చాడు. దాంతో ఆమెకు అబార్షన్‌ అయింది. అలా అనేక సార్లు ఆమెకు అబార్షన్‌ చేయించాడు. అలా చేయడం వల్ల ఆ యువతి అనారోగ్యానికి గురైంది. ఎక్కువ సార్లు అబార్షన్‌ చేయించడంతో అనారోగ్యం భారిన పడిన యువతి అందం తగ్గిందని చెప్పి ఆమెను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు.

ఇది కూడా చూడండి: Miss World 2025: టాలెంట్ ఫైనల్ రౌండ్ విజేతగా మిస్ ఇండోనేసియా.. నృత్యాలు, పాటలతో మారుమోగిన మిస్ వరల్డ్ వేదిక

జరిగిన విషయాన్ని బాధితురాలు అచ్యుత్‌ తల్లితో పాటు, వారి కుటుంబ సభ్యులకు, వారిద్దరికీ కామన్‌ స్నేహితులైన కావ్వ, ఆదిత్యకు కూడా చెప్పింది, కానీ వారెవ్వరూ పట్టించుకోలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు ఈ నెల 20న ఫిలింనగర్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.  బీఎన్‌ఎస్ 69,79,89, 351(3) సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసుకొన్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.    

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు