Live In Relationship: కామాంధుడి అరాచకం.. తల్లితో సహజీవనం.. కట్ చేస్తే కూతురితో.. జనగాం జిల్లాకి చెందిన రాజేందర్ ప్రేమ పేరుతో ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఆ మహిళ పెద్ద కూతురిని తనకి ఇచ్చి వివాహం చేయాలని, లేకపోతే చంపేస్తానని బెదిరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన తనకి న్యాయం జరగలేదని ఆ మహిళ మీడియాను ఆశ్రయించింది. By Kusuma 04 Nov 2024 in క్రైం వరంగల్ New Update షేర్ చేయండి జనగామ జిల్లాలో రఘునాథపల్లి మండలం బానాజీపేటలో ఓ కామాంధుడు అరాచకానికి పాల్పడ్డాడు. బానాజీపేటకు చెందిన ఓ మహిళతో రాజేందర్ 2007 నుంచి ప్రేమపేరుతో సహజీవనం చేస్తున్నాడు. ఇంతలో ఆమెకి 2009లో వేరే వ్యక్తితో వివాహం జరిగింది. రాజేందర్‌తో ఉన్న సంబంధం తెలిపి పెళ్లయిన మూడు రోజులకే భర్త వదిలేశాడు. దీంతో అప్పటినుంచి రాజేందర్‌తోనే సహజీవనం చేస్తోంది. ఈ మహిళకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇది కూడా చూడండి: ఏపీలో పింఛన్‌దారులకు బంపర్ ఆఫర్.. మూడు నెలల పెన్సన్ ఒకేసారి! న్యాయం జరగకపోవడంతో.. తల్లితో సహజీవనం చేస్తూనే కూతురిని పెళ్లి చేసుకుంటానని రాజేందర్ వేధించాడు. పెళ్లి చేసుకుంటే అందరం కలిసి ఉండవచ్చని వాళ్లను వేధించాడు. పెళ్లికి ఒప్పుకోకపోతే ముగ్గురిని చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. అక్కడ ఫిర్యాదు చేసిన తనకు న్యాయం జరగకపోవడంతో.. రాజేందర్ నుంచి తనకు, పిల్లలకు రక్షణ కల్పించాలని మీడియాను ఆశ్రయించింది. ఇది కూడా చూడండి: ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరుతో రూ.25 కోట్లు స్వాహా ఇదిలా ఉండగా ఇటీవల మెదక్ జిల్లాలో కూడా దారుణ ఘటన చోటుచేసుకుంది. యువతి ప్రేమించడం లేదని ఓ యువకుడు ప్రేమోన్మాది దాడి చేశాడు. మెదక్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఎదుట యువతి చేయిని కోసి పరారయ్యాడు. యువతి చేతికి తీవ్రంగా గాయాలు కావడంతో చికిత్స కోసం వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఇంకా విషమించడంతో వెంటనే హైదరాబాద్ తరలించారు. యువకుడు బెంగళూరుకి చెందిన చేతన్‌గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఆ యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇది కూడా చూడండి: విషాదం.. గొంతులో కోడి గుడ్డు ఇరుక్కుని.. యువతులు, మహిళలను వేధించే ఘటనలు ఈమధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. చెప్పిన పనులు చేయడం లేదని, ప్రేమను ఒప్పుకోలేదని, విసిగిస్తున్నారని ఫిర్యాదు చేసిన కొందరు దుర్మార్గులు ఇలానే ప్రవర్తిస్తున్నారు. ఇది కూడా చూడండి: నేడు కార్తీక సోమవారం.. శివుడిని ఎలా పూజించాలంటే? #live-in-relationship #janagama-district #crime మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి