విషాదం.. గొంతులో కోడి గుడ్డు ఇరుక్కుని..

నాగర్‌కర్నూల్‌కి చెందిన తిరుపతయ్య కోడి గుడ్డు తింటుండగా గొంతులో ఇరుక్కుపోయి.. ఊపిరాడక మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా మధ్యలో బజ్జీల షాప్‌ దగ్గర గుడ్డు తినడంతో ఈ విషాద ఘటన జరిగింది.

New Update
ఈ దేశంలో చెట్లపై గుడ్లు పండిస్తారు

ఇటీవల రోజుల్లో ఎవరి ప్రాణాలు ఎలా పోతున్నాయో తెలియడం లేదు. ఈ రోజు ఉన్న మనుషులు రేపటికి ఉండటం లేదు. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ విషాధ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నందివడ్డేమాన్‌ గ్రామానికి చెందిన తిరుపతయ్య అనే వ్యక్తి లింగాలలో ఉన్న బందువు ఇంటికి వెళ్లాడు.

ఇది కూడా చూడండి:  ఉచిత సిలిండర్ పొందాలంటే.. ఇవి తప్పనిసరి!

బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా..

ఆ తర్వాత వేరే ఇతర బంధువు ఇంటికి వెళ్తుండగా.. మధ్యలో బజ్జీల షాప్ దగ్గర ఆగాడు. అక్కడ కోడి గుడ్డు తింటుండగా.. అది గొంతులో ఇరుక్కుపోయింది. వెంటనే తిరుపతయ్యకు అసలు ఊపిరాడలేదు. అక్కడున్న స్థానికులు గమనించి వెంటనే అతనికి నీళ్లు తాగిస్తుండగానే మరణించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇచ్చారు. 

ఇది కూడా చూడండి: JEE అభ్యర్థులకు అలెర్ట్.. ఈసారి కీలక మార్పులు!

ఇదిలా ఉండగా ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుధా బాగీచా ప్రధాన రహదారిపై అతివేగంగా వెళ్తున్న స్కార్పియో కారు అదుపు తప్పి నేరుగా చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 6గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో ఇద్దరు చికిత్సపొందుతూ మరణించారు.

ఇది కూడా చూడండి:  శబరిమల యాత్రికులకు శుభవార్త.. ఉచిత బీమా కవరేజీ 

కుస్మి నుంచి సూరజ్‌పూర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికుల తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఓ బాలిక, ఓ మహిళ సహా ఆరుగురు పురుషులున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రైవర్ తోపాటు మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ ఇరువురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 8కి చేరినట్లు పోలీసులు తెలిపారు. 

ఇది కూడా చూడండి: కార్తీకంలో ఈ పనులు చేస్తే.. ముల్లోకాల పుణ్యమంతా మీ సొంతం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు