Hyderabad Road Accident : ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. కొంతంది మందుబాబులు మద్యం మత్తులో విచ్చలవిడిగా డ్రైవింగ్ చేస్తూ అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటున్నారు. ఇలాంటి విషాదకరమైన ఘటనే హైదరాబాద్ లో చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఈ దుండగుడు చేసిన పని రెండు కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది.
ఇది కూడా చూడండి: Fengal Cyclone : తీరాన్ని తాకిన తుపాను..జిల్లాలకు అధికారుల హెచ్చరికలు
ఇది కూడా చూడండి: BIG BREAKING: తెలంగాణలో ఆ ఉద్యోగ నోటిఫికేషన్ రద్దు..
నవదంపతులు అక్కడిక్కడే మృతి..
హైదరాబాద్ లంగర్ హౌస్ లో మద్యం మత్తులో కారు తోలుతున్న ఓ దుండగుడు అదుపు తప్పి అటుగా వస్తున్న బైక్, ఆటోను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న భార్య భర్తలు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆటోలోని నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. దంపతులను మొనా, దినేష్ గా గుర్తించారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు తెలిసింది. మొనా, దినేష్ మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కారు డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కారు సీజ్ చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది?
ఇది కూడా చూడండి: Adani: దాడులు మరింత బలాన్ని ఇస్తాయి..గౌతమ్ అదానీ