Hyderabad: తరుముకొచ్చిన మృత్యువు.. సాయం చేసిన వాడిని చంపేసిన కారు డ్రైవర్

రాజేంద్రనగర్ ఔటర్ రింగు రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. శివకేశవ అనే యువకుడు రోడ్డుపై బ్రేక్ డౌన్ అయిన కార్ టైర్ మారుస్తుండగా అటుగా వచ్చిన మరో టయోటా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివకేశవ అక్కడిక్కడే మృతి చెందాడు.

New Update
accident

Hyderabad: సాయం చేయడానికి వచ్చి ప్రాణాలు కోల్పోయాడు. ఓ కారు టైర్ మారుస్తుండగా.. మరో కారు ఢీకొట్టి చంపింది.  ఈ విషాద ఘటన రాజేంద్రనగర్ ఔటర్ రింగు రోడ్డుపై జరిగింది. 

పోలీసుల వివరాల ప్రకారం.. ఓ కారు హైదరాబాద్ నుంచి ఔటర్ రింగు రోడ్డు మీదుగా శంషాబాద్ వైపు వెళ్తుంది. అయితే  కారు హిమాయత్ సాగర్ Exit 17 వద్దకు రాగానే సడన్ గా బ్రేక్ డౌన్ అయ్యింది. దీంతో కారు డ్రైవర్ వెంటనే కారు రికవరీ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. దీంతో స్పాట్ కి చేరుకున్న రికవరీ సిబ్బంది శివకేశవ రోడ్డుపైనే బ్రేక్ డౌన్ అయిన కారు టైర్ ని మార్చడం మొదలు పెట్టాడు. ఇంతలోనే ఘోర ప్రమాదం జరిగింది. 

Also Read :  ఎలాంటి అంచనాలు లేకుండా భారీ విజయం.. ఈ వారం బెస్ట్ మూవీ సజెషన్ ఇదే!

Also Read :  ఆపరేషన్ సిందూర్.. అఖిలపక్ష భేటీలో మోదీ కీలక ప్రకటన

ప్రాణం తీసిన మితిమీరిన వేగం

శివకేశవ టైర్ మారుస్తుండగా..  అటుగా వచ్చిన  మరో టయోటా కారు మితిమీరిన వేగంతో ఈ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివకేశవ అక్కడిక్కడే మృతి చెందాడు.  కారు బలంగా ఢీకొట్టడంతో గాల్లో ఎగిరిపడ్డాడు. మరో ఇద్దరికి కూడా తీవ్ర గాలయ్యాయి. రెండు కార్లు నుజ్జు నుజ్జు అయ్యాయి. టయోటా కారు డ్రైవర్ మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణం అంటున్నారు  పోలీసులు. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read :  రంగంలోకి కేఏ పాల్... పాకిస్తాన్‌తో చర్చలు.. యుద్ధం వద్దంటూ..!

Also Read :  పాకిస్తాన్ కొంపముంచిన చైనా.. పాక్ సరిహద్దులో డ్రాగెన్ సరుకు ఫెయిల్

telugu-news | rajendranagar-outer-ring-road

Advertisment
తాజా కథనాలు