Crime News: దారుణం.. కొడుకు చదువట్లేదని కన్న తండ్రే.. కన్న కొడుకుని కత్తితో పొడిచి చంపేసిన ఘటన హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌లో జరిగింది. కొడుకు డిగ్రీ మానేసి, జులాయిగా తిరుగుతున్నాడని కూరగాయల కత్తితో తండ్రి పొడిచాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. By Kusuma 09 Nov 2024 in క్రైం హైదరాబాద్ New Update షేర్ చేయండి హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొడుకు చదువుకోవట్లేదని తండ్రి కత్తితో పొడిచి చంపిన ఘటన కర్మన్‌ఘాట్‌లో జరిగింది. జైపాల్ అనే యువకుడు డిగ్రీ మధ్యలోనే ఆపేసి ఏం పని చేయకుండా జులాయిగా తిరుగుతున్నాడు. దీంతో తండ్రి కొడుకును మందలించాడు. ఇది కూడా చూడండి: Amla: కార్తీక మాసంలో ఇంట్లో ఈ మొక్క నాటితే.. ఐశ్వర్య సిద్ధి తధ్యం! ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగడంతో.. ఇలా ఇద్దరి మధ్య గొడవ మాటామాట పెరిగి గొడవ పెద్దది అయ్యింది. దీంతో కూరగాయలు కోసే కత్తితో తండ్రి కొడుకును పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో జైపాల్ వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే ఓవైసీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇది కూడా చూడండి: Green Tea: ఉదయాన్నే గ్రీన్ టీ తాగేటప్పుడు ఈ మిస్టేక్స్ చేస్తున్నారా? ఇదిలా ఉండగా.. ఇటీవల కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లాలో కూడా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బొలేరో వాహనం కారును ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడకు చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు. గానుగాపూర్ దత్తాత్రేయ క్షేత్రానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో నలుగురు స్పాట్ లోనే మృతి చెందారు. ఇది కూడా చూడండి: తొలి టీ20లో భారత్ విజయం.. అదరగొట్టిన శాంసన్ ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.యూసఫ్‌గూడకు చెందిన భార్గవ కృష్ణ, ఆయన భార్య సంగీత, కొడుకు ఉత్తమ్ రాఘవ, కారు డ్రైవర్ రాఘవేంద్రగౌడ్ హైదరాబాద్ నుంచి కర్ణాటకకు వెళ్తున్నారు. డబుల్ రోడ్డు అయిన కూడా మధ్యలో డివైడర్లు లేకపోవడంతో అటువైపు నుంచి వేగంగా వస్తున్న బొలేరో వాహనం కారును బలంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనలో భార్గవ కృష్ణ కుటుంబంతో పాటు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఇది కూడా చూడండి: ఇక్కడ చేసిన ఫుడ్ తిన్నారో.. ఒక్కసారికే పైకి పోవడం గ్యారెంటీ! #hydrabad #crime-news #Karmanghat #crime మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి