Room Rent: దారుణ ఘటన.. ఇంటి అద్దె కట్టలేదని యజమాని ఏం చేశాడంటే? హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో ఇంటి అద్దె చెల్లించలేదని ఓ యువతిపై యజమాని కత్తితో దాడి చేశాడు. వెంటనే ఆ యువతిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితరాలి కుటుంబ సభ్యులు యజమానిపై ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By Kusuma 11 Nov 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంటి అద్దె కట్టలేదని ఓ యువతిపై యజమాని దాడి చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. అత్తాపూర్ హసన్ నగర్‌లో ఓ యువతి కుటుంబంతో కలిసి అద్దె ఇంట్లో ఉంటుంది. కొన్ని నెలల నుంచి ఇంటి అద్దె కట్టడం లేదని ఆ యజమాని యువతిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆ యువతి చేతికి, తలకి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆ యువతిని ఆసుపత్రికి తరలించారు. ఇది కూడా చూడండి: దారుణం.. టీచర్లు బ్లాక్ మెయిల్ చేస్తూ నీట్ విద్యార్థిపై.. కరెంట్ తీసేయడంతో వాగ్వాదం మొదలు.. ఇంటి అద్దె కట్టడం లేదని ఆ యువతి ఇంటికి యజమాని కరెంట్‌ను ఆపేశాడు. దీంతో యజమానికి, అద్దెకు ఉంటున్న కుటుంబానికి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆ యజమాని కుటుంబంపై దాడి చేయగా.. యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ యువతి కుటుంబ సభ్యులు యజమానిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చూడండి: ప్రేమించిన అమ్మాయిని దూరం చేశారని.. యువకుడు చేసిన పనికి అంతా షాక్! ఇదిలా ఉండగా.. ఇటీవల ఉమ్మడి నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం జయంపు గ్రామంలో ఇటీవల దారుణమైన హత్య జరిగింది. పక్క పక్కనే నివసిస్తున్న రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవలు కారణంగా ఈనెల రెండవ తేదీన ఇరువురు ఒకరి మీద ఒకరు బాలాయపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. ఇది కూడా చూడండి: Alert: హైదరాబాద్ వాసులు బి అలెర్ట్...ఈ ఏరియాల్లో వాటర్ బంద్! జయంపు గ్రామ శివారు ప్రాంతంలో అల్లం లక్ష్మయ్యను అత్యంత దారుణంగా రెండు చేతుల బొటనవేలును కట్టర్‌తో కట్ చేసి ఆపై రాడ్డు, కర్రలు, జాకీతో బలంగా కొట్టి అక్కడనుంచి పారిపోయారు. అధిక రక్త శ్రావంతో పడి ఉన్న లక్ష్మయ్యను గ్రామస్తులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఇది కూడా చూడండి: AP Budget 2024 Live: సంక్షేమానికి భారీగా నిధులు #hyderabad #crime #house-rent #house owner మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి