Online Fraud : ఆన్ లైన్ మోసం నుంచి బయటపడ్డ అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్న మహిళ..
Online Fraud : దేశంలో రోజురోజుకూ డిజిటల్ లావాదేవీలు పెరుగుతుండటంతో ఆన్ లైన్ మోసగాళ్లు కూడా కొత్తకొత్త పద్ధతులు కనిపెడుతున్నారు.
Online Fraud : దేశంలో రోజురోజుకూ డిజిటల్ లావాదేవీలు పెరుగుతుండటంతో ఆన్ లైన్ మోసగాళ్లు కూడా కొత్తకొత్త పద్ధతులు కనిపెడుతున్నారు.
గత ఏడాది అక్టోబర్ నాటికి దేశవ్యాప్తంగా దాదాపు రూ.1,143 కోట్లు.. సైబర్ నేరగాళ్ల చేతిలోనే పోయాయని ఓ నివేదికలో వెల్లడైంది. తెలంగాణ నుంచి పలువురు ఆన్లైన్ మోసాల బారినపడి 2023 అక్టోబర్లో ఏకంగా రూ.26 లక్షల పోగొట్టుకున్నారని పేర్కొంది.
ఓ మహిళ ఆన్లైన్లో ఐపీఎల్ టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు ప్రయత్నించింది. తనకు పెద్ద మోసం కూడా జరుగుతుందని ఆమెకు తెలియదు. ఈ మోసాన్ని అర్థం చేసుకునే సమయానికి ఆమె రూ.86 వేలు పోగొట్టుకుంది. ఇప్పుడు ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.