/rtv/media/media_files/2025/01/28/iOKfC711t8WW2JzFLsTC.jpg)
Gurumurthy wife murder case
Gurumurthy: మీర్‌పేట్ గురుమూర్తి భార్య మర్డర్ కేసు వివరాలను వెల్లడించారు రాసకొండ సీపీ సుధీర్ బాబు. గురుమూర్తి పోలీసులను మిస్ లీడ్ చేయడానికి ప్రయత్నించాడని చెప్పారు. మాధవి మర్డర్ పక్కా ప్లాన్ ప్రకారమే చేశాడని, ఎలాంటి క్షణికావేశంతో కాదని తెలిపారు. సంక్రాంతి ముందు రోజు కూడా గొడవలు జరుగుతున్నాయి. సంక్రాంతి రోజు భార్యతో ఉద్దేశపూర్వకంగానే గొడవపెట్టుకుని తలను గోడకేసి కొట్టాడు. ఆమె సృహ తప్పి పడిపోగానే కూర్చొని శ్వాస ఆగిపోయేదాకా గొంతు పిసికి పట్టుకున్నాడు. ఇదంతా అమ్మాయి వాళ్ల మేన మామకు చెప్పాడు. ఇంట్లో ఉన్న కత్తితో కాళ్లు కట్ చేశాడు. ఆ తర్వాత తల, చేతులు, మెడ కొసేశాడు. ఈ పీసులన్నీ వాటర్ హీటర్ నీళ్లలో ఉడికించాడు. పెద్ద స్టవ్ మీద బాయిల్ చేసిన పీసులను కాల్చేశాడు. సుత్తి, రోకలి బండతో ముక్కలు ముక్కలుగా పోడి చేసి సాయంత్రం 6 గంటలకు జిల్లెల గూడ చెరువులో వేసినట్లు దర్యప్తులో తేలిందన్నారు.
మరుసటి రోజు పిల్లలను తీసుకొచ్చి..
ఈ మేరకు మర్డర్ చేసిన మరుసటి రోజు పిల్లలను తీసుకొచ్చాడు. అమ్మ బయటకు వెళ్లిందని చెప్పి వారిని పడుకోబెట్టాడు. బెడ్ రూమ్ లాక్ చేసి ఉంచాడు. రెండు రోజలకు మాధవి మిస్ అయిందని ఆమె పెరెంట్స్ కు చెప్పాడు. ఇన్విస్టిగేషన్ చేసినప్పటినుంచి చాలా ఆధారాలు సేకరించాం. మేన మామకు చెప్పాడు. చెరువు దగ్గర చిన్న చిన్న బ్యాగులో పెట్టి పడేస్తే మున్సిపల్ వాళ్లు తీసుకెళ్లారని చెప్పాడు. ఆ తర్వాత మళ్లీ మెటిరీయల్ అంతా సీజ్ చేసి పరిశీలించాం. కానీ బయటపడలేదు. మళ్లీ పౌడర్ చేసినట్లు గుర్తించామన్నారు.
మాజీ జవాన్ అయిన గురుమూర్తి చాలా కృరమైన మనస్థత్వం కలిగిన వ్యక్తి. మనిషికుండే లక్షణాలు కనిపించట్లేదు. చంపిన నేరం మిస్సింగ్ కేసులా ఉంచేందుకు చాలా ప్రయత్నించాడు. పశ్చాత్తాపం కనిపించలేదు. అంతా బూడిద చేశాడు. 4 గంటలపాటు ఇళ్లంగా కడిగేశాడు. అతి కిరాతకమైన మర్డర్ ఇది. ఏ ఆధారం లేకుండా చాలా ప్లాన్స్ చేశాడు. ఒక వ్యక్తి చేయాల్సిన పనికాదు. కానీ అతను ఎలా చేయగలిగాడో. ఇంటర్నల్ ఇష్యూతోనే ఇలా చేశాడు. మూడు ఫ్లోర్స్ ఉన్న ఇళ్లు అది. మేము వెళ్లిన తర్వాత స్మెల్ వచ్చింది. పిల్లలకు కూడా స్మెల్ వస్తే డైవర్ట్ చేశాడు. పక్కా ప్లాన్ ప్రకారమే చేశాడు. క్షణకావేశం కాదు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం. మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. తప్పుదారి పట్టించొద్దు. అందరం బాధితురాలికి న్యాయం చేయాలి. మరోకరు ఇలా చేయకుండా చర్యలు తీసుకుంటాం. చాలా టీమ్స్ ఇందులో పాల్గొన్నాయని సీపీ అన్నారు.