/rtv/media/media_files/2025/01/16/JaXuMYyhvhzWmTHCRET4.jpg)
firing in hyd Photograph: (firing in hyd)
మేడ్చల్ జిల్లా రాచకొండ రాచకొండ కమిషనరేట్ పోచారం పీఎస్ పరిధిలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఇబ్రహీం అనే వ్యక్తి ప్రశాంత్ సింగ్ సోనూపై కాల్పులు జరిపి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు ఇబ్రహీం కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రశాంత్ సింగ్ సోనూ సింగ్ భూజానికి బుల్లెట్ గాయాలు అయ్యాయి. దీంతో అతన్ని హాస్పిటల్‌కు తరలించారు.
గోశాల నిర్వాహక ప్రతినిధి సోనూ సింగ్ పై ఇబ్రహీం అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. సోనూ సింగ్ ఛాతీ ఉదరం మధ్యలో కుడివైపు బుల్లెట్లు దూసుకుపోవడంతో తీవ్ర రక్తస్రావమైంది. బాధితుడిని సికింద్రాబాద్ యశోదా హాస్పిటల్‌కు తరలించారు. రాచకొండ సీపీ సుధీర్ బాబు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కాల్పులకు గల కారణాలను విచారిస్తున్నారు. బాధితుడు సోనూ సింగ్‌ని పరామర్శించేందుకు బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు హాస్పిటల్‌కు చేరుకున్నారు. రాష్ట్రంలో గన్ కల్చర్ పై పోటా పోటీగా రాజకీయ విమర్శలు కొనసాగుతున్న సందర్భంలో మరో కాల్పుల ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌కు బీజేపీ నేతలు వెళ్తున్నారు. బీజేపీ నేత చికోటి ప్రవీణ్‌ను అడ్డుకున్న పోలీసులు అడ్డుకున్నారు. యశోద దగ్గర హైటెన్షన్ వాతావరణ నెలకొంది. కాసేపట్లో హాస్పిటల్‌కు కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా చేరుకోనున్నట్లు సమాచారం. బుల్లెట్ గాయాలపాలైన వ్యక్తి బీజేపీ నాయకుడు. బాధితుడు సోను సింగ్ గో రక్షా దళానికి చెందిన వ్యక్తి.
Follow Us