Gujarat: గుజరాత్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్

గుజరాత్‌ రాజ్‌కోట్‌లో ఓ అపార్ట్‌మెంట్ భారీ అగ్ని ప్రమాద ఘటన జరిగింది. ఓ ఫ్లాట్‌లో అకస్మాత్తుగా మంటలు రావడంతో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని వారిని కాపాడే ప్రయత్నం చేశారు.

New Update
Gujarat Accident

Gujarat Accident Photograph: (Gujarat Accident )

గుజరాత్‌లో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజ్‌కోట్ పట్టణంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. ఆ మంటల్లో వారి ప్రాణాలు బూడిదయ్యాయి. ఒక ఫ్లాట్‌లో వచ్చిన మంటలు అపార్ట్‌మెంట్ మొత్తం వ్యాపించడంతో ప్రజలు భయాందళోనకు గురయ్యారు.

ఇది కూడా చూడండి: Horoscope Today: నేడు ఈ రాశి వారు అతిగా మాట్లాడకుండా ఉంటే బెటర్‌!

ఇది కూడా చూడండి: హరిహర వీరమల్లు మరోసారి వాయిదా.. ప్రకటించిన మేకర్స్ !

ఇద్దరికి తీవ్రంగా గాయాలు..

వెంటనే అపార్ట్‌మెంట్ నుంచి బయటకు పరుగులు తీశారు. అపార్ట్‌మెంట్ యజమాని అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే మంటలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. మిగతా వారిని ఫైర్ సిబ్బంది మంటల నుంచి రక్షిస్తోంది. మంటలు ఎలా వ్యాపించాయనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇది కూడా చూడండి: Russia-Trump: ఒప్పందం పై పుతిన్‌ అనుకూల వ్యాఖ్యలు..ఒకవేళ తిరస్కరిస్తే అంటున్న ట్రంప్‌!

ఇది కూడా చూడండి: Relation Tips: భయ్యా ఇలాంటి అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారో.. రోజూ నరకమే

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు