Online Gaming: ఆన్‌లైన్ డిజిటల్ గేమ్స్ ఆడే వారికి కేంద్రం బిగ్ షాక్!

ఆన్‌లైన్ గేమింగ్ నియంత్రించడానికి, 'రియల్ మనీ గేమింగ్' వ్యసనాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి మంత్రిత్వ శాఖ అధ్యక్షతన ఆన్‌లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది.

New Update
Online Gaming Authority of India

దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న ఆన్‌లైన్ గేమింగ్ నియంత్రించడానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 'రియల్ మనీ గేమింగ్' వ్యసనాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి మంత్రిత్వ శాఖ అధ్యక్షతన ఆన్‌లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా (OGAI)ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 'ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు-2025'(Online Gaming Ban Bill) కు ఆమోదం లభించింది. ఈ బిల్లు ప్రధాన లక్ష్యం ఆన్‌లైన్ గేమింగ్‌తో ప్రజలు, ముఖ్యంగా యువత ఆర్థికంగా నష్టపోకుండా, మానసిక సమస్యలకు గురికాకుండా కాపాడటమే. అధికారిక అంచనాల ప్రకారం, రియల్ మనీ గేమింగ్ ద్వారా ఏటా దాదాపు 45 కోట్ల మంది రూ. 20,000 కోట్ల వరకు నష్టపోతున్నారు.

Also Read :  ప్రియురాలిని హత్య చేసి బ్లూ డ్రమ్ములో కుక్కిన ప్రియుడు.. ఎందుకంటే?

ఆన్‌లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా

ఆన్‌లైన్ గేమ్‌(Online Gaming Apps)లను "మనీ గేమ్స్"(money gaming ban) (నిషేధితవి), "ఈ-స్పోర్ట్స్" (ప్రోత్సహించేవి), "సోషల్/ఎడ్యుకేషనల్ గేమ్స్" (నియంత్రణకు లోబడి ప్రోత్సహించేవి)గా ఈ అథారిటీ వర్గీకరిస్తోంది. బెట్టింగ్ ఉన్న అన్ని రకాల రియల్ మనీ గేమింగ్ సేవలను నిర్వహించడం, ప్రోత్సహించడం లేదా ప్రచారం చేయడంపై ఈ అథారిటీ కఠిన నిషేధాన్ని అమలు చేస్తుంది. నిబంధనల అమలును పర్యవేక్షించి, ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటుంది.

Also Read :  ప్రేమించి పెళ్లి.. వారం రోజులకే దూలానికి ఉరేసుకుని యువతి సూసైడ్!

కఠిన చర్యలు, భారీ జరిమానాలు:

ఈ కొత్త చట్టం ప్రకారం, నిబంధనలు ఉల్లంఘించి ఆన్‌లైన్ మనీ గేమింగ్ నిర్వహిస్తే గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ. 1 కోటి వరకు జరిమానా విధించవచ్చు. అంతేకాక, అటువంటి గేమ్‌లకు ప్రకటనలు, ప్రచారం చేసిన సెలబ్రిటీలు, యూట్యూబర్‌లకు సైతం శిక్ష తప్పదు. రియల్ మనీ గేమింగ్‌కు ఆర్థిక లావాదేవీల్లో సహకరించే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే, ఈ గేమ్‌లు ఆడేవారిని నేరస్తులుగా కాకుండా 'బాధితులుగా' పరిగణిస్తామని బిల్లులో పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు