KPHB లో దారుణం.. వేశ్యకు, విటుడికి గొడవ.. కత్తులతో దాడులు

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలో దారుణం జరిగింది. ఓ వేశ్యకు ఆమెను బుక్‌ చేసుకున్న విటుడికి మధ్య చెలరేగిన వివాదం కత్తుల దాడికి దారి తీసింది. ఇంతకీ అసలేం జరిగింతో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

New Update

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలో దారుణం జరిగింది. ఓ వేశ్యకు ఆమెను బుక్‌ చేసుకున్న విటుడికి మధ్య చెలరేగిన వివాదం కత్తుల దాడికి దారి తీసింది. ఇంతకీ అసలేం జరిగింతో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. హయాత్‌నగర్‌కు చెందిన మధుగౌడ్ అనే వ్యక్తి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు మంగళవారం రాత్రి కేపీహెచ్‌బీ పరిధిలోని రోడ్‌ నెంబర్‌ 1కు వచ్చాడు. అక్కడ ఓ వేశ్యను బుక్ చేసుకున్నాడు. ఈ సమయంలోనే వీళ్లిద్దరి మధ్య గొడవ చెలరేగింది. దీంతో ఆ వేశ్య తన మరిది సోహైల్‌కు ఈ విషయం చెప్పింది. 

Also Read: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వారికే మా మద్ధతు.. సంచలన ప్రకటన చేసిన కేటీఆర్

దీంతో సోహైల్ తన గ్యాంగ్‌తో కలిసి అక్కడికి వచ్చాడు. కత్తితో మధుగౌడ్‌పై దాడి చేశారు. ఈ దాడిలో మధు గౌడ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. మధు తండ్రి కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఆ వేశ్యతో పాటు నిందితులు సోహైల్, అతడి గ్యాంగ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.   

Also Read: తెలంగాణలో కొత్త మద్యం షాపులు.. లైసెన్స్‌లపై ప్రభుత్వం కీలక నిర్ణయం

Advertisment
తాజా కథనాలు