Basara : బాసరలో తీవ్ర విషాదం.. ఐదుగురు టూరిస్టులు మృతి

బాసర దర్శనానికి వెళ్లిన ఐదుగురు యువకులు గోదావరిలో గల్లంతు అయ్యారు. నదిలో స్నానానికి వెళ్లగా కొట్టుకుపోయారు. వారంతా హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌ చెందినవారు. గజఈగాళ్ల సాయంతో నలుగురి మృతదేహాలు బయటకు తీశారు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. 

New Update
V BREAKING

నిర్మల్ జిల్లాలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. బాసర టెంపుల్‌కు వెళ్లిన ఐదుగురు యువకులు గోదావరిలో గల్లంతు అయ్యారు. గోదావరి నదిలో స్నానానికి వెళ్లగా నదిలో ఐదుగురు యువకులు కొట్టుకుపోయారు. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌ చెందిన వారు బాసర జ్ఞానసరస్వతీ అమ్మవారి దర్శనానికి  విహార యాత్రకు వచ్చారు.

గజఈతగాళ్ల సాయంతో నలుగురి మృతదేహాలు బయటకు తీశారు. మరో వ్యక్తి కోసం సహయక చర్యలు కొనసాగుతున్నాయి.  మృతులు నలుగురు అంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మృతులు రాకేష్, వినోద్, రుతిక్, మదన్, భరత్ లు చనిపోయారు.

Advertisment
తాజా కథనాలు