రేవంత్‌పై అఘోరీ ఫైర్.. హైదరాబాద్‌లో భారీ ధర్నా.. టెన్షన్.. టెన్షన్!

హైదరాబాద్లో ధ్వంసమైన ముత్యాలమ్మ ఆలయం వద్ద తాను ధర్నా చేయబోతున్నట్లు RTV ఇంటర్వ్యూలో అఘోరీ సంచలన ప్రకటన చేశారు. గతంలో ఇదే ఆలయం వద్ద ఆత్మార్పణ చేసుకుంటానని ప్రకటించడంతో పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పుడు ఏం చేస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది

New Update

అందరం కలిసికట్టుగా సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం, ఆడపిల్లలను కాపాడుకుందాం, గోహత్యలను ఆపుదాం అని అఘోరి పిలుపునిచ్చారు. ప్రకృతిని కాపాడాలని తన గురువు గారు చెప్పారన్నారు. ఇందుకోసం కూడా తన పోరాటం ఉంటుందని ప్రకటించారు. చాలా మంది అఘోరీలు కూడా ఇందుకోసం రావాలని ప్రయత్నిస్తున్నారన్నారు. కుంభమేళా తర్వాత వారందరితో కలిసి పోరాడుతానన్నారు. ఈ రోజు ఏడుపాయల వనదుర్గా మాతను దర్శించుకున్న అనంతరం ఆర్టీవీతో ఆఘోరీ ప్రత్యేకంగా మాట్లాడారు. తాను హెచ్చరించిన నాటి నుంచి రాష్ట్రంలో ఆరు దేవాలయాలు ధ్వంసం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అడ్డుకోవడానికి రేవంత్ సర్కార్ ఏం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అందరం కలిసి ఆలయాలను కాపాడుకుందాం..

ఎవరి కోసం ఎదురు చూడకుండా ఆలయాలను మనం అందరం కలిసి కాపాడుకుందాం అని భక్తులకు అఘోరీ పిలుపునిచ్చారు. తనను నమ్ముకున్న భక్తులకు ఎప్పుడూ అండగా ఉంటానన్నారు. ఒక వేళ తాను ఆత్మార్పణ చేసుకున్నా కూడా తన ఆత్మకూడా లోక కల్యాణం కోసమే పని చేస్తుందన్నారు. రాష్ట్రంలోని పలు ఆలయాలను సందర్శించిన తర్వాత సికింద్రాబాద్ లో దాడికి గురైన ముత్యాలమ్మ ఆలయానికి వెళ్లి ధర్నా చేయనున్నట్లు చెప్పారు. అమ్మవారిపై దాడి చేసిన వారిని ఎందుకు కాపాడుతున్నరో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిందితులకు బందోబస్తు ఇచ్చి కాపాడుతూ.. తనను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని ఫైర్ అయ్యారు. 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు